RRR: అమృత్‌సర్‌లో ట్రిపులార్‌ టీమ్‌.. గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు

ట్రిపులార్‌ టీమ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది. అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు డైరెక్టర్‌ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.

RRR: అమృత్‌సర్‌లో ట్రిపులార్‌ టీమ్‌.. గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు
Rrr Team
Follow us

|

Updated on: Mar 21, 2022 | 12:21 PM

ట్రిపులార్‌ టీమ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది. అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు డైరెక్టర్‌ రాజమౌళి(Rajamouli), హీరోలు ఎన్టీఆర్‌(Jr NTR), రామ్‌చరణ్‌(Ram Charan). సినిమా హిట్‌ అవ్వాలని కోరుకున్నారు. ట్రిపులార్‌ ఇద్దరు ఫ్రీడమ్‌ఫైటర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ కథ అన్నారు రాజమౌళి. పంజాబీలు సినిమా చూసి ఆదరించాలని కోరారు. ఈనెల 25న ట్రిపులార్‌ విడుదలుతుందని చెప్పారు రామ్‌చరణ్‌. సినిమా చూశాక బాహుబలికి ఇదేమీ తక్కువ కాదన్న ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. బాహుబలిని ఎలా ఆదరించారో ట్రిపులార్‌ని కూడా అంతే ఆదరించాలని కోరారు హీరో ఎన్టీఆర్‌. గోల్డెన్‌ టెంపుల్‌కి వచ్చాక చక్కని ప్రశాంతతతో మనసు నిండిపోయిందన్నారు. ఈ సినిమా ఇప్పటికే రూ.1000కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​ కూడా చేసిందని ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్​, సాంగ్స్​, ట్రైలర్​లో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ తమ లుక్స్​ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్​ స్టార్స్​ అలియాభట్​, అజయ్​ దేవగణ్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమా రూ.2500 నుంచి రూ.3000 కోట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 25న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.  తొలి ఆట‌కే RRRను చూడాల‌ని ఇటు మెగా ఫ్యాన్స్‌..అటు నంద‌మూరి ఫ్యాన్స్ పోటీలు ప‌డుతున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా తార‌క్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.

Also Read: ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్