AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..

బాలీవుడ్ హీరో అనిల్‌ కపూర్‌ గారాల పట్టి, ప్రముఖ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది.

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..
Sonam Kapoor
Basha Shek
|

Updated on: Mar 21, 2022 | 1:42 PM

Share

బాలీవుడ్ హీరో అనిల్‌ కపూర్‌ గారాల పట్టి, ప్రముఖ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజా (Anand Ahuja)తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోనమ్‌ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. బేబీబంప్  (Pregnancy) తో భర్త ఒడిలో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నిన్ను పెంచడానికి అన్ని మా నాలుగు చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉన్న ప్రతిధ్వనించే రెండు హృదయాలు ఉన్నాయి. నీపై ప్రేమాభిమానాలు కురిపించే ఒక ఫ్యామిలీ ఉంది. నీ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సోనమ్‌.  ఆనంద్‌ అహుజా కూడా ఇదే పోస్ట్‌ను షేర్‌ చేశాడు. ఈక్రమంలో అమ్మానాన్నలుగా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తోన్న సోనమ్‌- అహుజాలకు కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, ఏక్తా కపూర్‌, అన్షులా కపూర్‌, వాణీ కపూర్‌, అనన్యా పాండే, హన్సిక సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

కాగా అనిల్‌ కపూర్‌ వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్‌. అయితే తన అందం, అభినయంతో అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్టార్‌ డమ్‌ తెచ్చుకుంది. సావరియా సినిమాలో రణబీర్‌ కపూర్‌తో కలిసి మొదటిసారిగా సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించిన ఈ సొగసరి ఢిల్లీ-6, ఐ హేట్‌ లవ్‌స్టోరీస్‌, మౌసమ్‌, ప్లేయర్స్‌, థ్యాంక్యూ, రాన్‌జానా, ఖూబ్‌సూరత్, ప్రేమ్‌రతన్‌ధన్‌పాయో, నీర్జా, ప్యాడ్‌మ్యాన్‌, వీర్ ది వెడ్డింగ్‌ తదితర సినిమాలతో స్టార్‌ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నీర్జా సినిమాలో ఆమె అభినయానికి విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కాగా ఆమె చివరిగా 2019లో విడుదలైన జోయా ఫ్యాక్టర్‌ సినిమాలో ఫుల్‌లెంత్ హీరోయిన్‌గా నటించింది. ఆతర్వాత ఏకే వర్సెస్‌ ఏకె సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. కాగా సోనమ్‌-ఆనంద్‌ లది ప్రేమ వివాహం. 2018 ముంబైలోని బాంద్రాలో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా