AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

RRR in Delhi: దక్షిణాది (South India) మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ నిన్న దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో ప్రమోషన్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) ..

RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్
Aamir Khan Dances To Rrr Na
Surya Kala
|

Updated on: Mar 21, 2022 | 11:44 AM

Share

RRR in Delhi: దక్షిణాది (South India) మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ నిన్న దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో ప్రమోషన్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, తారక్ లతో అమీర్ ఖాన్ “నాటు నాటు” సాంగ్ కు స్టెప్స్ వేశారు. అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ అమీర్ ఖాన్‌కి పాటకు స్టెప్పులు నేర్పించారు. అమీర్ ఖాన్ కు ఎన్టీఆర్ స్టెప్పులు వివరించగా, ఆ తరువాత ముగ్గురూ కలిసి స్టెప్స్ వేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ  నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే దుబాయ్, కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించుకున్న ఆర్ఆర్ఆర్.. ఈరోజు రాజస్థాన్ లోని జై పూర్ లో ప్రమోషన్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలతో తెరకెక్కుతున్న కల్పిత చిత్రం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు.  అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రకని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కికలకపాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు అమీర్ ఖాన్ నటించిన తాజాగా సినిమా లాల్ సింగ్ చద్దా 2022 ఆగష్టు 11న రిలీజ్ కానుంది. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

Also Read :

Reliance: వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ముఖేష్ అంబానీ..మరో కొత్త సంస్థలో మెజారిటీ వాటాలు కొనుగోలు