Shahid Kapoor: మరో తెలుగు సినిమాపై మనసు పారేసుకున్న షాహిద్.. మళ్లీ అదే హీరో రీమేక్‌తో..
Shahid Kapoor: తెలుగు సినిమా (Tollywood) స్థాయి పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సౌత్‌కు మాత్రమే పరిమితమయిన తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా కథకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు...

Shahid Kapoor: తెలుగు సినిమా (Tollywood) స్థాయి పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సౌత్‌కు మాత్రమే పరిమితమయిన తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా కథకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడో విడుదలైన సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ కూడా యూట్యూబ్‌లో (Youtube) రికార్డు వ్యూస్ దక్కించుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో తెలుగు సినిమా రీమేక్‌లు సైతం బాలీవుడ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్స్ తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఒకరు.
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన షాహిద్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్‌లో విజయం సాధించిందో, హిందీలోనూ అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో షాహిద్ జెర్సీని సినిమాను కూడా రీమేక్ చేశారు. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కించారు. ఇందులో షాహిద్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఇదిలా ఉంటే షాహిద్ చూపు ఇప్పుడు మరో తెలుగు సినిమాపై పడినట్లు తెలుస్తోంది.

ఈ యంగ్ హీరో ఈసారి కూడా నాని సినిమానే రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని షాహిద్ కపూర్ రీమేక్ చేయనున్నట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో నటించిన కృతీ శెట్టినే ఆ పాత్ర కోసం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
HAL School Jobs: హైదరాబాద్ హాల్ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య




