AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance: వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్న ముఖేష్ అంబానీ..మరో కొత్త సంస్థలో మెజారిటీ వాటాలు కొనుగోలు

Reliance: తండ్రిని నుంచి వారసత్వంగా లభించిన వ్యాపారాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ.. ఏ వ్యాపారం ప్రారంభించినా ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభాల బాట పట్టిస్తారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఓ వైపు..

Reliance: వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్న ముఖేష్ అంబానీ..మరో కొత్త సంస్థలో మెజారిటీ వాటాలు కొనుగోలు
Reliance Retail, Jio
Surya Kala
|

Updated on: Mar 21, 2022 | 11:47 AM

Share

Reliance: తండ్రిని నుంచి వారసత్వంగా లభించిన వ్యాపారాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ.. ఏ వ్యాపారం ప్రారంభించినా ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభాల బాట పట్టిస్తారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఓ వైపు తమ్ముడు వ్యాపారంలో ఫెయిల్యూర్స్ అవుతుంటే.. అన్న మాత్రం పట్టిందల్లా బంగారమే అన్నచందంగా ముందుకెళ్తున్నారు. భారత దేశంలో అపర కుబేరుడుగానే కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చేరారు. అయితే తాజాగా మరో ప్రముఖ కంపెనీలో రిలయన్స్ సంస్థ పెట్టుబలు పెట్టారు. ప్రముఖ ప్రీమియం లోదుస్తుల రిటైల్‌ సంస్థ క్లోవియాకు చెందిన మెజారిటీ వాటాలను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. క్లోవియా మాతృసంస్థ పర్పుల్‌ పాండ్‌ ఫ్యాషన్స్‌లో 89 శాతం ఈక్విటీ వాటాలను రిలయన్స్ సంస్థ రూ. 950 కోట్లకు దక్కించుకుంది. ఇక, మిగతా వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్‌మెంట్‌ దగ్గర ఉన్నాయి. 2013లో పంకజ్ వర్మనీ, నేహా కాంత్,  సుమన్ చౌదరిలు కలిసి సంయుక్తంగా ప్రారంభించారు.

క్లోవియా మహిళల కోసం ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్‌లను ఉత్తమ క్వాలిటీతో అందిస్తోంది. కస్టమర్స్ ను ఆకట్టుకునేలా ఫ్రెష్ స్టైల్స్ తో సరసమైన ధరలకు అందిస్తూ.. ప్రసిద్ధి చెందింది. క్లోవియాలో  3,500కి పైగా ఉత్పత్తి శైలులు ఉన్నాయి RRVL తెలిపింది. కాగా తాజా పరిణామాలపై క్లోవియా, రిలయన్స్ ఇరు సంస్థలు స్పందిస్తూ.. సంయుక్తంగా ఓ ప్రకటన వెలువరించారు. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందిచడమే తమ లక్ష్యమని.. అందుకే క్లోవియా బ్రాండ్‌ను కూడా తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చామని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ వెల్లడించారు. ఇప్పటికే జివామె, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్‌ఆర్‌వీఎల్‌కు తాజాగా క్లోవియా కొనుగోలుతో ఇన్నర్‌ వేర్‌ సెగ్మెంట్‌లో మరింత విస్తరించినట్టు అయ్యింది.

Also Read:

Drinking Water: కనెక్షన్లకు డిపాజిట్ కట్టలేదని.. కుళాయిలకు బిరడాలు బిగిస్తున్న అధికారులు.. ఎక్కడంటే

Viral Photo: పూజ గదిలో వొడ్కా బాటిల్‌ .. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో.. అమ్మలు అంతే అంటున్న నెటిజన్లు