AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: కనెక్షన్లకు డిపాజిట్ కట్టలేదని.. కుళాయిలకు బిరడాలు బిగిస్తున్న అధికారులు.. ఎక్కడంటే

Drinking Water: అసలే వేసవి కాలం (Summer Season).. కొన్ని ప్రాంతాల్లో గుక్కెడు నీరు కోసం చాలా దూరం వెళ్తుంటారు.  తాజాగా కుళాయి విషయంలో కర్నూలు జిల్లా(Kurnool District) లో మున్సిపల్ అధికారుల తీరు..

Drinking Water: కనెక్షన్లకు డిపాజిట్ కట్టలేదని.. కుళాయిలకు బిరడాలు బిగిస్తున్న అధికారులు.. ఎక్కడంటే
Drinking Water Issue In Kur
Surya Kala
|

Updated on: Mar 21, 2022 | 10:39 AM

Share

Drinking Water: అసలే వేసవి కాలం (Summer Season).. కొన్ని ప్రాంతాల్లో గుక్కెడు నీరు కోసం చాలా దూరం వెళ్తుంటారు.  తాజాగా కుళాయి విషయంలో కర్నూలు జిల్లా(Kurnool District) లో మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. కుళాయి కనెక్షన్లకు డిపాజిట్‌ కట్టలేదని.. కనెక్షన్లు తొలగించి గొట్టాలకు బిరడాలు బిగిస్తున్నారు. ఐదు రోజుల క్రితం చెత్త పన్ను కట్టలేదని దుకాణాల సముదాయం ముందు మున్సిపాలిటీ చెత్త వేసి నవ్వులపాలైన మున్సిపల్ అధికారులు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నీటి కొళాయి కి డిపాజిట్ కట్టలేదని ఉద్దేశంతో కుళాయిలకు నీరు రాకుండా చెక్కతో మూత వేసిన వైనం వివాదాస్పదమైంది. డిపాజిట్ చెల్లించినట్లు కూడా బాధితులు చెబుతున్నారు.

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ లో ఈ వివాదం చోటుచేసుకుంది. డిపాజిట్ కూడా అత్యధికంగా 6400 రూపాయలు విధించారని అంత డబ్బు చెల్లించలేమని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు అనధికార కనెక్షన్ల పేరుతో తొలగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు తప్పు సరిదిద్దుకుని తాగు నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గూడూరు నగర పంచాయతీ బాధితులు.

ఇదే విషయంపై నగర పంచాయతీ కమిషనరు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.20 లక్షల బకాయిలున్నాయని చెప్పారు. అంతేకాదు చాలా అనధికార  కనెక్షన్లు చాలా ఉన్నాయని.. అందుకనే అలాంటి కుళాయిలు చెక్క బిరడాలతో క్లోజ్ చేస్తున్నామని చెబుతున్నారు.

Also Read:

Yadadri Temple: యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. బాలాలయంలో పంచకుండాత్మక యాగం

Sound Pollution: నగరంపై ఉరుముతున్న శబ్ద మేఘాలు.. సౌండ్ పొల్యూషన్ తో ఉక్కరిబిక్కిరి