Nellore: ప్రేమకు నో చెప్పిందని దారుణం.. ఇంటర్ విద్యార్థిని గొంతుకోసిన యువకుడు..
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెంకటగిరిలోని కాలేజీ మిట్ట వద్ద ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెంకటగిరిలోని కాలేజీ మిట్ట వద్ద ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు (Nellore) జిల్లాకు చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు గత కొన్ని రోజులుగా చిగురుపాటి జ్యోతిక(18) ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. తరచూ తను చదివే కళాశాల దగ్గరకు వెళ్లి తన ప్రేమను ఒప్పుకోవాలంటూ ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే జ్యోతిక మాత్రం నిరాకరిస్తూ వస్తోంది.
కాగా తన ప్రేమను ఒప్పుకోవడం లేదన్న కారణంతో జ్యోతికపై కక్ష పెంచుకున్నాడు కృష్ణ. ఇవాళ ఫుల్లుగా మద్యం సేవించి విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితుడిని చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికను నెల్లూరు జిల్లా ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా విద్యార్థినిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు.
Also Read:Noise ColorFit Pro 3 Alpha: నాయిస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. మీ ఒత్తిడిని కూడా చెప్పేస్తుంది..
Summer Tips: సమ్మర్‌లో స్కిన్ ట్యానింగ్‌కు గురవుతోందా? అయితే ఈ నేచురల్ ఫేస్ ఫ్యాక్‌లు మీకోసమే..