Summer Tips: సమ్మర్‌లో స్కిన్‌ ట్యానింగ్‌కు గురవుతోందా? అయితే ఈ నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..

Skin Care Tips in Summer: ఇతర సీజన్లతో పోల్చుకుంటే వేసవిలో చర్మ సంరక్షణపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విపరీతమైన ఎండ, వేడిమి, చెమట కారణంగా స్కిన్‌ ట్యానింగ్‌ (Skin Tanning) కు గురవుతోంది.

Summer Tips: సమ్మర్‌లో స్కిన్‌ ట్యానింగ్‌కు గురవుతోందా? అయితే ఈ నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..
Skin Care Tips
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2022 | 9:56 AM

Skin Care Tips in Summer: ఇతర సీజన్లతో పోల్చుకుంటే వేసవిలో చర్మ సంరక్షణపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విపరీతమైన ఎండ, వేడిమి, చెమట కారణంగా స్కిన్‌ ట్యానింగ్‌ (Skin Tanning) కు గురవుతోంది. దీనివల్ల ముఖంలో మెరుపు మాయమైపోతుంది. నల్లటి మచ్చలు, మొటిమలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక చాలామంది వేసవిలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది కూడా చర్మం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ముండు వేసవిలో చర్మం సంరక్షణపై స్పెషల్‌ కేర్‌ తీసుకోవాలనుకుంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. అలాగనీ బయట మార్కెట్లలో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు, సన్‌స్ర్కీన్లను వాడొద్దంటున్నారు. వీటికి బదులు ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్‌ ప్యాక్‌లు తయారుచేసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పెరుగు, తేనె..

ఈ రెండింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. ముఖ్యంగా పెరుగులోని పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అదేవిధంగా తేనె చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు తేమను అందిస్తుంది. మరి ఈ రెండు పదార్థాలతో కలిసి ఫేస్‌ ప్యాక్‌ను ఎలా తయారుచేయాలంటే.. మీరు ఒక గిన్నెలో మూడు చెంచాల పెరుగుని తీసుకుని, దానికి ఒక చెంచా తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. సుమారు అరగంట తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి. ఫలితంగా చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

పాలు, దోసకాయ

దోసకాయలోని హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేయడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో పాలలో ఉండే గుణాలు కూడా ముఖంలో కాంతిని తీసుకొస్తాయి. అందుకే చర్మ సంరక్షణలో ఈ రెండు పదార్థాలను ఉత్తమమైనవిగా భావిస్తారు చర్మ సౌందర్య నిపుణులు. ఈ ఫేస్‌ ప్యాక్ చేయడానికి.. ఒక గిన్నెలో 5 నుంచి 6 చెంచాల పాలను తీసుకోవాలి. అందులోకి రెండు చెంచాల తురిమిన దోసకాయ రసాన్ని మిక్స్‌ చేయండి. అనంతరం ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆపై సాధారణ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

అరటి, చక్కెర

ఈ ఫేస్‌ ప్యాక్ తయారుచేయడం కోసం అరటిపండును గుజ్జులా చేసి అందులోకి చక్కెరను మిక్స్‌ చేయాలి. తయారుచేసుకున్న పేస్ట్‌ను చేతులతో ముఖంపై మృదువుగా అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. కాగా అరటిపండులో ఉండే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయని స్కిన్‌ స్పెషలిస్టులు చెబుతుంటారు. అందుకే వేసవిలో వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్‌ను అప్లై చేసుకుంటే మంచి ఫలితముంటుందని సూచిస్తున్నారు.

Also Read:Viral Video: కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. పగలబడి నవ్విన బంధువులు.. ఫన్నీ వీడియో

Market News: ఊగిసలాటలో సూచీలు.. స్వల్ప లాభాలతో ఆరంభం.. ఫోకస్ లో ఉన్న ఆ షేర్లు..

FMCG Prices Hike: యుద్ధం తెచ్చిన తంటాలు.. మళ్లీ పెరగనున్న ఆ వస్తువుల ధరలు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో