Viral Video: కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. పగలబడి నవ్విన బంధువులు.. ఫన్నీ వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వధువు ఒక కొంటెపని చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అల్లరి అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్‌లు తమ అందమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి వివిధ రకాల పోజులు ఇవ్వాలని జంటలని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయం ఎంత ముదిరిపోయిందంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహిస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి తర్వాత వధూవరులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వధువు తన చేతులతో వరుడికి అన్నం తినిపించాలని అనుకుంటుంది. ఇది చూసి పెళ్లికొడుకు సంతోషంతో పొంగిపోతాడు. అన్నం కలిపి నెమ్మదిగా అతనికి తినిపించడానికి ఎంతో ప్రేమగా చేయి అతని నోటిదాకా తీసుకెళుతుంది, కానీ సడెన్‌గా ఆ ముద్దని తనే తినేస్తుంది. ఇది చూసిన అక్కడున్నవారంతా పగలబడి నవ్వుతారు. పెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకు నోరెళ్లబెడుతాడు. అందరు అతడి ఎక్స్‌ప్రెషన్స్ చూసి మరింత నవ్వుతారు. పెళ్లిలో ఇలాంటి సరదా సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు చిలిపి పెళ్లికూతరు అంటూ అమ్మాయిని అభినందిస్తున్నారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ చిలిపి ఈ వీడియోని వేలల్లో లైక్ చేశారు. తమదైన శైలిలో వధూవరులను అభినందిస్తున్నారు. ఆ క్యూట్ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

