Prabhas comments on marriage: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. అందుకే సింగిల్‌గా ఉన్నానంటున్న డార్లింగ్..!(వీడియో)
డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యారు ప్రభాస్.
డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యారు ప్రభాస్. ఇందులో భాగంగా మార్చి3న ముంబైలో రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్ ఈ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు. కాగా తాజాగా విడుదలైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అని పూజ నోటి నుంచి ఒక డైలాగ్ వినిపిస్తుంది. దీనిని గుర్తు చేస్తూ ఓ జర్నలిస్ట్ ‘మీ రియల్ లైఫ్‌లో కూడా అలా ప్రేమ విషయంలో లెక్క తప్పిందా?’ అంటూ ప్రభాస్‌ను అడిగారు. దీనికి స్పందించిన డార్లింగ్ ‘ ‘ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్ ట్రైలర్ ఈవెంట్‌లో భాగంగా ప్రభాస్, పూజ జాతకాలు చూపించుకున్నారు. ఆస్ట్రాలజీ కార్నర్‌లో హస్తసాముద్రికా నిపుణుడితో వీరు జాతకం చెప్పించుకుంటోన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్ వైరల్‌గా మారాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..