AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FMCG Prices Hike: యుద్ధం తెచ్చిన తంటాలు.. మళ్లీ పెరగనున్న ఆ వస్తువుల ధరలు..

FMCG Prices Hike: సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది. ఈ సారి వారికి షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు(FMCG Companies) సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నందున తప్పని స్థితిలో ధరలు పెంచే దిశగా అవి అడుగులు వేస్తున్నాయి.

FMCG Prices Hike: యుద్ధం తెచ్చిన తంటాలు.. మళ్లీ పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
Fmcg
Ayyappa Mamidi
|

Updated on: Mar 21, 2022 | 9:40 AM

Share

FMCG Prices Hike: సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది. ఈ సారి వారికి షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు(FMCG Companies) సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నందున తప్పని స్థితిలో ధరలు పెంచే దిశగా అవి అడుగులు వేస్తున్నాయి. ప్రతి ఇంట్లో రోజు వారీ వినియోగించే గోధుమలు, వంటనూనెలు(Cooking Oil), ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు అమాంతం 10 శాతం మేర పెరగనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పెంపు నిర్ణయం తప్పటంలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్నాక్స్ తయారీలో ముడిపదార్థాల ధరల పెరుగుదల ఈ పెంపుకు మరో కారణంగా నిలిచిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. గోధుమ, నూనె, చమురు ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ధరల పెంపు తప్పనిదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ.. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్​యూనిలివర్ లిమిటెడ్, నెస్లే గత వారంలో తమ ఉత్పత్తుల రేట్లను పెంచాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై సుమారు ప10 నుంచి 15 శాతం మేర ధరలు పెరుగుతాయని పార్లే ప్రోడక్ట్స్​ సీనియర్​ క్యాటగిరీ హెడ్​ మయాంక్​ షా చెబుతున్నారు. కానీ కచ్చితంగా ఎంతపెరుగుతాయనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అంటున్నారు. ఈ నెల పారంభంలో రూ.180 గా ఉన్న పామాయిల్ లీటర్ ధర.. స్వల్పంగా తగ్గి రూ.150కు చేరుకుంది. ముడి చమురు రష్యా డిస్కౌంట్ వల్ల తక్కువ ధరకు లభించటం, అంతర్జాతీయంగా ధరలు కొంత తగ్గటం జరిగినా అవి సరిపోవని ఆహార పదార్థాల తయారీ కంపెనీలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి..

Multibagger Return: 13 సంవత్సరాల్లో లక్షాధికారిని కోటీశ్వరులను చేసిన షేర్.. పూర్తి వివరాలు..

EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..