Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..

EPFO News: కొత్త సంవత్సరంల ఆరంభం జనవరి నెలలోనే నికరంగా 15.29 లక్షల మంది కొత్త చందాదారులు ఈపీఎఫ్‌ఓ చేరారు. దీనికి సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ వివరాలను విడుదల చేసింది.

EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 21, 2022 | 7:39 AM

EPFO News: కొత్త సంవత్సరంల ఆరంభం జనవరి నెలలోనే నికరంగా 15.29 లక్షల మంది కొత్త చందాదారులు ఈపీఎఫ్‌ఓ చేరారు. దీనికి సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(Employees’ Provident Fund Organization) క్లారిటీ ఇచ్చింది. గత సంవత్సరం (2021) డిసెంబరులో కొత్తగా చేరిన 12.60 లక్షల మందితో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఈపీఎఫ్ అధికారులు వెల్లడించారు. అంటే గతంలో కంటే కొత్తగా మరో 2.69 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక శాఖ(Labor Department) తెలిపింది. జనవరిలో చేరిన మొత్తం 15.29 లక్షల మంది చందాదారుల్లో.. దాదాపు 8.64 లక్షల మంది 1952 ఈపీఎఫ్‌ అండ్‌ ఎంపీ చట్టంలోని సామాజిక భద్రత కింద నమోదయ్యారు. మరో 6.65 లక్షల మంది ఈ పథకం నుంచి వైదొలగి, ఈపీఎఫ్‌ఓలో మళ్లీ చేరారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా ఖాతాలు తెరచిన ఉద్యోగుల్లో అత్యధికంగా 18-25 సంవత్సరాల యువతకు 6.90 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇదే సమయంలో 25-35 ఏళ్ల వారికి 3.23 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తాదా లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీటి ఆధారంగా చూస్తుంటే కరోనా తరువాత కొత్త ఉద్యోగాల కల్పన వేగవంతమైనట్లు తెలుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని చెప్పటానికి ఈ గణాంకాలు ఊతం ఇస్తున్నాయి.

ఇవీ చదవండి..

Crypto Currency: GST పరిధిలోకి క్రిప్టో కరెన్సీలు.. ఎంత శ్లాబ్ రేటు కింద పన్ను వసూలు చేస్తారంటే..

Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!