Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!
Ratan Tata: రతన్ టాటా భారత వ్యాపారవేత్తల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. దివాళా తీసే దశలో ఉండే కంపెనీలను కొనుగోలు చేసి వాటికి పునరుజ్జీవనం పోయటంలో ఆయనకు పెట్టింది పేరు.
Ratan Tata: రతన్ టాటా భారత వ్యాపారవేత్తల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. దివాళా తీసే దశలో ఉండే కంపెనీలను కొనుగోలు చేసి వాటికి పునరుజ్జీవనం పోయటంలో ఆయనకు పెట్టింది పేరు. చరిత్ర కూడా మనకు అదే చూపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఎయిర్ ఇండియా వ్యాపారాన్ని తనలో కలుపుకున్న టాటా గ్రూప్(Tata Group) తాజాగా.. కరోనా కారణంగా దెబ్బతిన్న అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్(Ford Motors) తయారీ యూనిట్లను కొనబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలోనూ టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ మనదేశంలో 85 శాతం వాహనాలను ఉత్పత్తి చేస్తుండగా..అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ మాత్రం చేతులెత్తేసింది. ఈ మేరకు భారత్‌లోని ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో గుజరాత్ సంసద్లోని తయారీ యూనిట్, తమిళనాడు చెన్నై నగరంలోని ప్లాంట్లను అమ్మకానికి పెట్టింది. వీటిలో సంసద్ యూనిట్‌ను కొనేందుకు టాటా మోటార్స్ ఆసక్తి చూపుతోంది. కొనుగోళ్లలో భాగంగా సంసద్ యూనిట్ ప్రతినిధుల్ని టాటా గ్రూప్ సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి గుజరాత్ సీఎంతో వచ్చే వారం సమావేశం కూడా జగరనుంది.
సమావేశంలో టాటా గ్రూప్.., ఫోర్డ్ యూనిట్‌లను కొనుగోలు చేయనుందన్న ప్రతిపాదనలపై ఒక స్పష్టత కావచ్చు. ఒకవేళ అదే జరిగితే మరికొద్ది రోజుల్లో ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ హస్తగతం అవుతుంది. ఇక గుజరాత్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటాకు అమ్మిన తర్వాత.. పీఎల్‌ఐ స్కీమ్‌లో ఫోర్డ్ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. గతంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాక్వార్, రేంజ్ రోవర్ వ్యాపారాలను సొంతం చేసుకుని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న టాటా మోటార్స్ ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ నిర్ణయం వల్ల టాటా మోటార్స్ రానున్న ఎలక్ట్రిక్ మార్పును వేగంగా అందిపుచ్చుకునేందుకు కొత్త ప్లాంట్లు ఉపకరిస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇప్పటికే టాటా గ్రూప్ EV వ్యాపారంలో అందరికంటే వేగంగా దూసుకుపోతోంది.
ఇవీ చదవండి..
Forest Bathing: జపనీయులు వారానికి ఒక్కసారైనా అడవి స్నానం చేస్తారట.. ఎందుకో తెలుసా..?