Gold Silver Price Today: నిలకడగా బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు
Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైన పసిడి ధరలు పెరుగుతూనే..
Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైన పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ఎగబాకిన ధరలు.. తాజాగా దిగి వస్తున్నాయి. అయితే సోమవారం (March 21) మాత్రం స్థిరంగా ఉన్నాయి. అలాగే వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,420 వద్ద నమోదవుతోంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 వద్ద ఉంది.
ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.51,600 ఉంది.
కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది.
బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 ఉంది.
కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది.
వెండి ధరలు:
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, ముంబైలో రూ.68,000 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కోల్‌కతాలో రూ.68,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, కేరళలో రూ.72,300 వద్ద కొనసాగుతోంది.
కాగా, బంగారం, వెండి ధరల్లో రోజులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పరిశీలించి వెళ్లడం మంచిది.
ఇవి కూడా చదవండి: