Diesel Price Hike: దేశంలో పెట్రో ధరల మంట.. బల్క్ యూజర్లకు భారీగా పెంపు.. ఏకంగా లీటర్‌కు రూ.25
దేశప్రజలపై పెట్రోబాంబు పేలేందుకు సిద్దంగా ఉంది. ఐదురాష్ట్రాల తరువాత తొలిసారి దేశంలో పెట్రోధరల మంట మండింది.
Petrol, diesel prices today: దేశప్రజలపై పెట్రోబాంబు పేలేందుకు సిద్దంగా ఉంది. ఐదురాష్ట్రాల తరువాత తొలిసారి దేశంలో పెట్రోధరల మంట మండింది. బల్క్ యూజర్లకు లీటర్ డీజిల్ ధర ఏకంగా 25 రూపాయలు ఒకేసారి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 40 శాతం పెరగడంతో- బల్క్ యూజర్లకు ఇచ్చే ఇంధనం ధర పెంచేశారు. త్వరలో పెట్రోధరలు కచ్చితంగా పెరుగుతాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. బల్క్ యూజర్లు అంటే బస్ ఫ్లీట్ ఆపరేటర్లు, మాల్స్, ఎయిర్‌పోర్టులు వంటి పలురంగాల సంస్థలు. వీళ్లు సాధారణంగా నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ముంబైలో లీటర్ డీజిల్ ధర 94 రూపాయల 14 పైసలు. కానీ బల్క్‌గా కొనుగోలు చేయాలంటే ఈ డీజిల్ లీటర్ ధర 122 రూపాయలు. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలు ఉంటే బల్క్ రేటు 115 రూపాయలు. డీజిల్ ధరలు పెరగడంతో- బల్క్ వినియోగదారులు కూడా పెట్రోల్ బంకుల దగ్గరే రీటైల్గా కొంటున్నారు. మనదేశంలో నవంబర్ 4, 2021 నుంచి రీటైల్ దరలు పెరగలేదు. కానీ బల్క్ ధరలు పెరగడం దేనికి సూచన అన్నదే అసలు పాయింట్.
బల్క్ యూజర్లకు రేట్లు పెంచితే ప్రైవేట్ ఇంధన రీటైల్ పరిస్థితి ఏంటన్నదే కీలకంగా మారింది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలు తమ రీటైల్ బంకుల్ని మూసేస్తాయా అన్నది చూడాల్సి ఉంది. 2008లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 1432 పెట్రోల్ బంకుల్ని మూసేసింది. మొత్తమ్మీద బల్క్ యూజర్లకు పెంచిన 25 రూపాయల లీటర్ ధర ఆసక్తికరంగా మారింది.
Also Read: Shocking: ఆటోపైకి వాటర్ బెలూన్ విసిరిన ఆకతాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకే