AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Gas: భారత్ గ్యాస్ సరికొత్త ఆప్షన్.. ఇంటర్నెట్ లేకుండానే గ్యాస్ బుకింగ్, పేమెంట్స్ చేయొచ్చు.. అదెలాగంటే..!

Bharat Gas: భారత్ గ్యాస్ తన వినియోగదారుల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్‌తో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, పేమెంట్స్ మరింత సులభతరం అయ్యింది.

Bharat Gas: భారత్ గ్యాస్ సరికొత్త ఆప్షన్.. ఇంటర్నెట్ లేకుండానే గ్యాస్ బుకింగ్, పేమెంట్స్ చేయొచ్చు.. అదెలాగంటే..!
Gas
Shiva Prajapati
|

Updated on: Mar 20, 2022 | 9:10 PM

Share

Bharat Gas: భారత్ గ్యాస్ తన వినియోగదారుల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్‌తో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, పేమెంట్స్ మరింత సులభతరం అయ్యింది. LPG సిలిండర్ బుకింగ్, చెల్లింపుల కోసం.. ‘వాయిస్ బేస్డ్ పేమెంట్ ఫెసిలిటీ’ పేరుతో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సదుపాయంలో IVR ద్వారా మాట్లాడటం, చెల్లింపులు చేయవచ్చు. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ లేకపోయినా.. ఇంటర్నెట్ లేకపోయినా వినియోగదారులు ఎల్‌పీజీ ని బుక్ చేసుకోవచ్చు. ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ అవసరం లేదంటోంది భారత్ గ్యాస్. దీనికోసం భారత్ గ్యాస్.. అల్ట్రా క్యాష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వినియోగదారులు కేవలం మాట్లాడటం ద్వారా గ్యాస్ బుకింగ్, పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. ఐవీఆర్ సాయంతో మాట్లాడి.. UPI123pay ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ డబ్బులు చెల్లించవచ్చునని భారత్ గ్యాస్ ప్రకటించింది.

ఈ నంబర్ నుండి బుకింగ్ చేయొచ్చు.. IVR సౌకర్యం దేశంలోని 40 మిలియన్లకు పైగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని భారత్ గ్యాస్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు దీని గరిష్ట ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గత వారం, RBI గవర్నర్ శక్తికాంత దాస్ UPI 123pay సౌకర్యాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో UPI123Pay నుండి గ్యాస్ చెల్లింపులను ప్రారంభించిన దేశంలోనే మొదటి కంపెనీగా భారత్ గ్యాస్ నిలిచింది. భారత్ గ్యాస్ తన కస్టమర్ల కోసం 080-4516-3554 నెంబర్‌ను ప్రకటించింది. ఈ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని, దీనిద్వారానే గ్యాస్ మనీ కూడా చెల్లించవచ్చు అని పేర్కొంది.

UPI 123Pay ఎలా పనిచేస్తుంది.. UPI 123pay మూడు దశల్లో పని చేస్తుంది. ఈ మూడు దశలను పూర్తి చేసిన తర్వాత, లావాదేవీలు ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతాయి. కాల్, సెలక్షన్, పే మూడు దశలు. కాగా, UPI 123Pay అనేది తక్షణ చెల్లింపు వ్యవస్థ. దీని ద్వారా తక్షణ లావాదేవీలు జరుపవచ్చు. ఈ సిస్టమ్ పూర్తిగా ఇంటర్నెట్ అవసరం లేకున్నా పని చేస్తుంది. యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు.

గ్యాస్ బుకింగ్ ప్రాసెస్.. 1. వినియోగదారులు తమ ఫీచర్ ఫోన్ నుండి IVR నంబర్‌ను డయల్ చేస్తారు. ఇందుకోసం భారత్ గ్యాస్ 080-4516-3554 నంబర్ ప్రకటించింది. 2. కస్టమర్ ఈ విధానాన్ని తొలిసారి ఉపయోగిస్తున్నట్లయితే.. వారి కాల్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పుడే ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. 3. వినియోగదారులు అకౌంట్ ప్రాసెస్ కోసం సంబంధిత బ్యాంకు వివరాలను అడుగుతుంది. 4. కస్టమర్స్‌కి mobile.voice@psp ఫార్మాట్‌లో ఉన్న UPI ID ఇవ్వబడుతుంది. 5. కస్టమర్స్ యూపీఐ పిన్‌ను సెట్ చేయకుంటే.. పిన్‌ను సెట్ చేయమని అడుగుతుంది. అప్పుడు డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత మొబైల్‌లో పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6. ఆ తరువాత IVRలో కస్టమర్ UPI నంబర్‌ను క్రియేట్ చేయమని అడుగుతారు. యూపీఐ నెంబర్ క్రియేట్ చేసిన తరువాత డబ్బులు రిసీవ్ చేసుకోవడం, పంపడం చేయొచ్చు. 7. ఇలా కస్టమర్ ఫీచర్ ఫోన్‌ను ఉపయోగించి కూడా యూపీఐ లావాదేవీలు, గ్యాస్ బుకింగ్, మనీ పేమెంట్ చేయొచ్చు.

Also read:

TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధం.. సోమవారం నుంచి వారం రోజుల పాటు..

Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..