Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..

Health Care Tips: వేసవిలో తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా

Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..
Heart Health
Follow us

|

Updated on: Mar 20, 2022 | 8:21 AM

Health Care Tips: వేసవిలో తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. అంతేకాదు.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉంటాయి. పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు.. రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే, హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయ.. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో పొటాషియం, లైకోపీన్ వంటి వివిధ పోషకాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయను రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మామిడి.. వేసవి వచ్చిందంటే చాలు.. మామిడి కాయల పేరు మోత మోగిపోతుంది. వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మామిడి పండు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, అనేక విటమిన్లు ఉంటాయి.

బెర్రీస్.. బెర్రీస్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె జబ్బులకు సంబంధించిన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే బెర్రీలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు అనేక విధాలుగా బెర్రీలను తీసుకోవచ్చు.

బొప్పాయి.. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. ఇది వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

పీచు పదార్థాలు.. పీచ్‌ పదార్థాలు ఉండే ఆహారాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుత ప్రయోజనాలను ఇస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

Also read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!