Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!

Viral Video: సాధారణంగా చెరువులు, నదులలో మనం చిన్న చిన్న చేపలను చూసుంటాం. చివరకు 30 నుంచి 40 కేజీల బరువుండే చేపలను మాత్రమే చూసుంటం.

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!
Dinosaur Fish
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 19, 2022 | 7:37 PM

Viral Video: సాధారణంగా చెరువులు, నదులలో మనం చిన్న చిన్న చేపలను చూసుంటాం. చివరకు 30 నుంచి 40 కేజీల బరువుండే చేపలను మాత్రమే చూసుంటం. పోనీ కొందరు 100 కిలోల చేపలను సైతం చూశామని చెబుతుంటారు. అది వేరే విషయం. అయితే, నేడు అందుకు మించిన చేప.. కనిపించి కంపింప జేస్తోంది. అవును.. సముద్రంలో తిమింగలం మాదిరిగా.. భారీ సైజు చేప నదిలో కోలాహలం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10.5 అడుగుల భారీ చేప.. సుమారు 500 నుంచి 600 పౌండ్ల బరువు ఉండే చేపను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. చిన్నపాటి తిమింగలం మాదిరిగా ఉన్న ఈ చేపతో ఓ వ్యక్తి సరదాగా ఆడుకున్నాడు. దానిని పట్టుకుని, ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

కెనడాలోని ఫ్రేజర్ నది పరిసర ప్రాంతాల్లో కెనడియన్ జాలరి అయిన వైవ్స్ బిస్సన్ చేపల వేట సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి భారీ చేప కనిపించింది. దానిని చూసి అవాక్కయ్యాడు. స్టర్జన్ ఫిష్‌గా పిలిచే ఈ చేప నదిలో కనిపించడంతో దానిని పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. దానితో సరదాగా గడిపారు. బిస్సన్ ఈ చేపను కెమెరాలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిస్సన్ తనను తాను స్టర్జన్ గైడ్‌గా పేర్కొంటూ.. ‘‘నేను చూసిన అతిపెద్ద చేపల్లో ఇది ఒకటి’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ చేప 10.5 అడుగుల పొడవు, 500 నుంచి 600 పౌండ్ల బరువు ఉండొచ్చని అంచనా వేశారు.

అయితే, ఈ స్టర్జన్ ఫిష్ యవసు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టర్జన్‌లు జురాసిక్ యుగం నుంచి ఉంటున్నాయని, ఇవి బతికున్న డైనోసార్స్ అని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, బిస్సన్.. అతనితో పాటు ఉన్నవారు ఆ స్టర్జన్ చేపను పట్టుకుని దాని కొలతలు తీసుకున్నారు. అనంతరం.. RFID చిప్‌ ట్యాగ్ చేసిన తర్వాత స్టర్జన్‌ను వదిలేశారు. కాగా, ట్రయాసిక్ కాలంలో(245-208 మిలియన్ సంవత్సరాల క్రితం) శిలాజ రికార్డులో మొదటిసారిగా కనిపించే ఈ ఆదిమ చేపలలోని సుమారు 29 జాతులకు స్టర్జన్ అనేది ఒక సాధారణ పేరుగా పేర్కొంటున్నారు పరిశోధకలు. దీని పరిమాణంలో ఏ మార్పులు చోటు చేసుకోలేదన్నారు. ఈ ఆక్వాటిక్ అనాక్రోనిజమ్‌ నోటిలో దంతాలు ఉండవని, మనుషులకు ఎలాంటి హానీ తలపెట్టవని చెబుతున్నారు. కాగా, ఇవి సగటున.. 7 నుంచి 10 అడుగుల పరిమాణంలో పెరుగుతాయట. అంతేకాదు.. 26 అడుగుల కంటే ఎక్కువ కూడా పెరిగే చేపలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.

Also read:

Viral Video: చిన్నోడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు.. క్షణాల వ్యవధిలోనే గట్టిగా ఇచ్చిపడేశాడు..!

Summer Health Tips: జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండి..!

Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..