Micro-Zombie: మంచు కొండల్లో పరిశోధన..శాస్త్రజ్ఞులకు షాక్ 24 వేల ఏళ్ళనుంచి సజీవంగా ఓ వింత జీవి..

Micro-Zombie: శాస్త్రవేత్తలు(scientists) పరిశోధన చేస్తున్న సమయంలో మంచులో నుంచి ఒక జీవి.. సజీవంగా బయటకు వచ్చింది. ఆ వింత జీవిని చూసి మొదట శాస్త్రజ్ఞులు షాక్ అయ్యారు. ఎందులకంటే శరీరంలోని రక్తం కూడా గడ్డకట్టే

Micro-Zombie: మంచు కొండల్లో పరిశోధన..శాస్త్రజ్ఞులకు షాక్ 24 వేల ఏళ్ళనుంచి సజీవంగా ఓ వింత జీవి..
Zombie Creatures
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2022 | 8:58 PM

Micro-Zombie: శాస్త్రవేత్తలు(scientists) పరిశోధన చేస్తున్న సమయంలో మంచులో నుంచి ఒక జీవి.. సజీవంగా బయటకు వచ్చింది. ఆ వింత జీవిని చూసి మొదట శాస్త్రజ్ఞులు షాక్ అయ్యారు. ఎందులకంటే శరీరంలోని రక్తం కూడా గడ్డకట్టే చలిలో మంచులో ఉన్న ఆ వింత జీవిని చూడడమే కాదు.. అది బతికి ఉండడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వింత జీవి మంచులో ఒకటీ రెండు కాదు వేల ఏళ్లుగా కప్పబడి ఉందని.. ఆ మంచులో తిండి కూడా లేకుండా జీవించి ఉందని గుర్తించిన వారు అత్యంత షాక్ కు గురి అయ్యారు. ఈ వింత జీవి ఆర్కిటిక్‌ సముద్రంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో వెలుగులోకి వచ్చింది. గత  24 వేల ఏళ్లుగా శీతల సమాధిలోనే కూరుకుని ఉందని గుర్తించారు.

మైక్రోస్కోపిక్ జాంబీస్ గత 50 మిలియన్ సంవత్సరాల క్రితం శీతల ప్రాంతంలో నివసిస్తుండేవి. ఈ జీవి నోటి చుట్టు వెంట్రుకలు ఉంటాయి. శరీరం పొడవుగా ఉంటుంది. అంతేకాదు ఈ జీవులు చాలా చిన్నవి.. వీటిని చూడాలంటే మైక్రోస్కోప్‌ సాయం తీసుకోవాల్సిందే. టి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు. ఈ సూక్ష్మ జీవుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి అలైంగికమైనవి. అంటే తమలాంటి సూక్ష్మ జీవికి జన్మనివ్వడానికి వీరికి ఏ విధమైన భాగస్వామి అవసరం లేదు. అలాంటి ఈ జీవి తాజాగా అత్యంత శీతల ప్రదేశమైన ఆర్కిటిక్ లో బయటపడింది. ఇది

దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమీ తినకుండా జీవించి ఉంది. దీనిని శాస్త్రజ్ఞులు బయటకు తీయగానే వెంటనే తనలాంటి మరో జీవికి ప్రాణం పోసింది. ఈ వింతజీవి చర్మంపై అంత్యంత శీతల ప్రాంతంలో కూడా మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని శాస్త్రజ్ఞులు చెప్పారు. వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని తెలిపారు. గతంలో రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 10ఏళ్ల వరకు జీవించగల రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు.

Also Read:

Janasena: వైసీపీ నేతలు హద్దుమీరుతున్నారు.. ప్రజలే బుద్ధి చెబుతారన్న నాదెండ్ల

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!