Janasena: వైసీపీ నేతలు హద్దుమీరుతున్నారు.. ప్రజలే బుద్ధి చెబుతారన్న నాదెండ్ల
Janasena: తూర్పుగోదావరి జిల్లా(East Godavari) లో ఎక్కడ పోటీచేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఓడిస్తా అంటూ కాకినాడ(Kakinada) ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్..

Janasena: తూర్పుగోదావరి జిల్లా(East Godavari) లో ఎక్కడ పోటీచేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఓడిస్తా అంటూ కాకినాడ(Kakinada) ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ (Dwarampudi Chandrasekhar) చేసిన సవాల్ పై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడిన మాటలు చాలా అహంకారపూరితంగా ఉన్నాయని.. ఆయనకు ఇంతటి అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని నాదెండ్ల వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జనసేన నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదని నాదెండ్ల స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ద్వారంపూడి సమయం వృథా చేసుకోకుండా ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మాని, కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాకినాడ అభివృద్ధిపై దృష్టి సారించాలి. పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలు, డంపింగ్ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి. పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఆలోచించండి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, అధికారంలో ఉన్నాం కదా అని ఏంమాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరబాటేనని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే అవకాశం లేదు. ఆయనపై జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ గెలవడం ఖాయం అని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో జనసేన బలంగా ఉంది. గతంలో మహిళలను ద్వారంపూడి గాయపరిచారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆ వీరమహిళలే ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Also Read: One Kidney Village: ఆకలి తీర్చుకోవడానికి అమ్మకానికి అవయవాలు… ఆ గ్రామంలో అందరూ ఒక్క కిడ్నీ ఉన్నవారే..
