Visakha-TTD: విశాఖ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు.. స్వామివారికి వెండి వస్తువులను బహుకరించిన భక్తులు
Visakha-TTD: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ(Sri venkateswara temple) మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు శనివారం ఉదయం నుంచి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు..
Visakha-TTD: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ(Sri venkateswara temple) మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు శనివారం ఉదయం నుంచి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమ కార్యమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుబట్టాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న విద్యుత్, పుష్పాలంకరణలు: టిటిడి విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు, పలు దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లతో శ్రీవారి ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయాలను వివిధ రకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు, కట్ ఫ్లవర్స్‌తో అలంకరించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు 18 హోమగుండాలు ఏర్పాటు చేశారు. శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం ముందు మార్చి 23వ తేదీ శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు షెడ్డు ఏర్పాటు చేశారు.
వెండి పూజాసామాగ్రి బహూకరణ:
స్వామివారికి విశాఖపట్నం గాయత్రి కళాశాల కు చెందిన వ్యాగ్రేశ్వరశ్వరశర్మ దంపతులు శుక్రవారం సాయంత్రం స్వామి వారికి వెండితో చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం, రెండు వెండి బిందెలు, పూజా సామగ్రిని బహూకరించారు. సిఎంఆర్ సంస్థ తరపున పంచపాత్ర, వెండి ఉద్ధరిణి, వెండి పళ్ళెం డెప్యూటీ ఈవో రమణ ప్రసాద్‌కు వీటిని అందజేశారు.
Also Read:
Micro-Zombie: మంచు కొండల్లో పరిశోధన..శాస్త్రజ్ఞులకు షాక్ 24 వేల ఏళ్ళనుంచి సజీవంగా ఓ వింత జీవి..