- Telugu News Photo Gallery Spiritual photos Devotees can take part in all Arjitha Sevas at Tirumala temple from April 1st photos
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రేపు ఆర్జిత సేవల బుకింగ్
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో, వచ్చేనెల 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను టీటీడీ అనుమతించనుంది.
Updated on: Mar 19, 2022 | 4:48 PM


కరోనా కారణంగా, 2020 మార్చి నుంచి ఏకాంతంగా అర్చకులు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో ఆర్జిత సేవలకు భక్తులకు అవకాశం కల్పించారు టీటీడీ అధికారులు.

ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం(మార్చి 20న) ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించనున్నారు.

ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేయనుంది టీటీడీ.

టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 2న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి నాడు తోమాల, అర్చన, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ అధికారులు.

ఇదిలా ఉండగా తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఏప్రిల్, మే, జూన్ నెల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గం.లకు విడుదల చేయనున్నారు.

మే నెల కోటాను 22వ తేదీ ఉదయం 9 గం.లకు విడుదల చేస్తారు. జూన్ నెల కోటా 23వ తేదీ ఉదయం 9 గం.లకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ 30వేల టికెట్లు, సోమవారం నుంచి బుధవారం వరకు ప్రతి రోజూ 25 వేల టికెట్లను ఇవ్వనున్నారు.

అటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ కానీ, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేస్తింది టీటీడీ.

భక్తులు తమ ఆరోగ్యం, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు.




