AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro tips: జ్యోతిష్య నివారణలు.. చక్కెరతో ఇలా చేస్తే ఆర్థిక, మానసిక కష్టాలన్నీ తీరిపోతాయట..!

Astro tips: కొందరు ఎంత కష్టపడినా, అంకిత భావంతో పని చేసినప్పటికీ.. తమ కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకోలేకపోతుంటారు. అంతేకాదు.. నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు.

Astro tips: జ్యోతిష్య నివారణలు.. చక్కెరతో ఇలా చేస్తే ఆర్థిక, మానసిక కష్టాలన్నీ తీరిపోతాయట..!
Astro
Shiva Prajapati
|

Updated on: Mar 20, 2022 | 6:00 AM

Share

Astro tips: కొందరు ఎంత కష్టపడినా, అంకిత భావంతో పని చేసినప్పటికీ.. తమ కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకోలేకపోతుంటారు. అంతేకాదు.. నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే, దీనికి కారణం.. మానవ ప్రయత్నాలతో పాటు, జ్యోతిష్య సంబంధిత అంశాలు కూడా ఉన్నాయని వారికి తెలియదు. అందుకే చాలా మంది కష్టపడి పని చేస్తున్నా.. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని బాధపడుతుంటారు. అయితే, ఇలాంటి కాల దోషాలు తొలగిపోవడానికి జ్యోతిస్య శాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాటిని అనుసరించడం ద్వారా దోషాలను తొలగించవచ్చంటున్నారు. జ్యోతిష్యంలో వివిధ సమస్యలకు వివిధ పరిష్కారాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా పంచదారకు(చక్కెర) సంబంధించిన జ్యోతిష్య చర్యలు పాటించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కెరీర్‌తో పాటు, చక్కెరకు సంబంధించిన జ్యోతిష్య సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయట. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందట. మరి చక్కెరకు సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రహ దోషాలను తొలగిస్తాయి.. పంచదారకు జ్యోతిష్య పరిహారాలు పాటించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇందుకోసం మీరు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో కొంత చక్కెర వేయాలి. ఆ నీటిని ఉదయాన్నే సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు త్వరగా ప్రసన్నుడై గ్రహ దోషాలు తొలగిస్తాడని విశ్వాసం.

వ్యాపారంలో లాభం కోసం.. ఎవరైనా వ్యాపారంలో అడ్డంకులు, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే.. వారు చక్కెర నివారణలను చేయొచ్చు. చక్కెరతో చేసిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒక రాగి పాత్రను తీసుకుని అందులో కొన్ని నీళ్లలో చక్కెర వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం పూజ చేసిన తర్వాత ఈ నీటిని తాగాలి. అలాగే, మీరు ఏదైనా శుభకార్యాల కోసం బయటకు వెళుతున్నట్లయితే, ఆ సమయంలో తయారుచేసిన నీటిని ఖచ్చితంగా తాగాలి. ఇలా చేయడం ద్వారా అన్ని అంశాల్లో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం.

పితృదోష నివారణ.. ఇంట్లో పితృ దోష సమస్యలు ఉంటే.. ఆర్థికంగానే కాకుండా శారీరకంగా కూడా సమస్యలు చుట్టుముడుతాయి. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య తరచూ విబేధాలు ఏర్పడుతున్నాయి. చక్కెరకు సంబంధించిన నివారణ ప్రభావవంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. పిండితో రోటీని తయారు చేసి, అందులో పంచదార కలపాలి. వాటిని కాకులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జ్యోతిష్య పండితులు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనికి టీవీ9 తెలుగు కి ఏమాత్రం సంబంధం లేదు.

Also read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!