Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. అందుకే ఉక్రెయిన్‌పై పవర్‌ఫుల్‌ సూపర్‌సోనిక్‌..

Russia - Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!
Russia Vs Ukraine
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 19, 2022 | 10:34 PM

Russia – Ukraine Crisis: ఉక్రెయిన్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. అందుకే ఉక్రెయిన్‌పై పవర్‌ఫుల్‌ సూపర్‌సోనిక్‌ మిస్సైళ్లను ప్రయోగిస్తోంది రష్యా. అవును.. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంచనాలు తారుమారు అవతున్నాయి. నాలుగు రోజుల్లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ తమ సైన్యం స్వాధీనం అవుతుందని పుతిన్‌ భ్రమపడ్డారు. కాని యుద్దం ప్రారంభమై 24 రోజులు గడుస్తున్పప్పటికి కీవ్‌ను ఆక్రమించిడం రష్యా సైన్యం తరం కావడం లేదు. కీవ్‌ శివార్ల వరకు వచ్చిన రష్యా సైన్యానికి చుక్కలు చూపించింది ఉక్రెయిన్‌ సైన్యం. దీంతో 70 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయింది రష్యా సైన్యం.

ఇక ఉక్రెయిన్‌ యుద్దాన్ని తొందరగా ముగించాలన్న ఆలోచనతో ఉన్నారు పుతిన్‌. అందుకే ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ను కూడా ప్రయోగిస్తున్నాయి. ఈ క్షిపణులతోనే ఒడోసా తదితర ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ ఆయుధాగారాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. గంటకు ఆరువేల కిలోమీటర్ల వేగంతో ఈ మిస్సైల్స్‌ ప్రయాణం చేస్తాయి. రష్యా ఎయిర్‌ఫోర్స్‌ ఉక్రెయిన్‌ ట్యాంకులపై దాడి చేసిన దృశ్యాలను తాజాగా విడుదల చేసింది.

మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, నాటో దేశాలు ఆయుధాలను, క్షిపణులను సమకూర్చుతుండడంతో రష్యా సేనలు ముందుకు కదల్లేకపోతున్నాయి. ఉక్రెయిన్‌కే కాదు.. రష్యా మిలిటరీకి కూడా ప్రాణనష్టం అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పది రోజుల్లో ఆ దేశాన్ని చేజిక్కించుకుని తమ ప్రావిన్స్‌గా మార్చేస్తామని బీరాలు పలికిన రష్యన్‌ కమాండర్లు.. యుద్ధం ప్రారంభమై 23 రోజులు గడచినా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుంచి పరువుగా ఎలా బయటపడాలా అని పుతిన్‌ ఆలోచిస్తునట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ క్లస్టర్‌ బాంబులను ఉపయోగిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది.

జెలెన్‌స్కీ వార్నింగ్.. బెదిరింపులతో చర్చలు కుదరవని, పరస్పరం గౌరవించుకున్నప్పుడే అది సాధ్యమన్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా తరతరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, ఖార్కీవ్‌లో రష్యా బాంబుల వర్షం కురిపించడంతో ఓ అపార్ట్‌మెంట్‌ పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని అతికష్టం మీద సహాయక సిబ్బంది కాపాడారు. స్వల్పగాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

Also read:

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Rahul Gandhi: ద్వేషం, కోపం రంగాల్లోనూ భారతదేశానికి త్వరలోనే అగ్రస్థానం.. కేంద్రంపై రాహుల్ వంగ్యాస్త్రాలు!

Health Tips: వీరు బంగాళాదుంప తక్కువగా తినాలి.. లేకపోతే ఈ సమస్యలు తప్పవు..