One Kidney Village: ఆకలి తీర్చుకోవడానికి అమ్మకానికి అవయవాలు… ఆ గ్రామంలో అందరూ ఒక్క కిడ్నీ ఉన్నవారే..
One Kidney Village: మన శరీరంలోని అవయవాలు బతకడానికి ఆధారం.. అవి పనిచేస్తేనే,, మనిషికి మనుగడ..ఇది అందరికీ తెలిసిందే.. అయితే కొందరికి శరీరంలోని అవయవాలు బతకడానికి ఆధారంగా కూడా మారుతున్నాయి..
One Kidney Village: మన శరీరంలోని అవయవాలు బతకడానికి ఆధారం.. అవి పనిచేస్తేనే,, మనిషికి మనుగడ..ఇది అందరికీ తెలిసిందే.. అయితే కొందరికి శరీరంలోని అవయవాలు బతకడానికి ఆధారంగా కూడా మారుతున్నాయి. కరువు కాటేసి.. తినడానికి తిండి లేక.. అవసరాలను తీర్చుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వేళ… కొందరు తమ శరీరంలోని కిడ్నీని అమ్ముకుని.. తమని తామే కాదు.. తమ కుటుంబ సభ్యులను కూడా బతికించుకుంటున్నారు. తాము బతికేందుకు ఒక కిడ్నీ చాలని, మరో కిడ్నీతో ఆకలి బాధకు స్వస్తి చెబుతున్నారు. దీంతో ఆ గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు ఒక కిడ్నీ ఉన్నవారే. అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న ‘వన్ కిడ్నీ విలేజ్’ గురించి ఈరోజు తెలుసుకుందాం
ఆఫ్ఘానిస్తాన్(afghanistan) దేశాన్ని గత ఏడాది తాలిబన్లు(Talibans) హస్తగతం చేసుకున్నారు. దీంతో అక్కడ ప్రజల జనజీవనం మరింత దారుణ స్థితికి చేరుకుంది. ఆకలి దప్పులను కూడా తీర్చుకొని కటిక పేదరికానికి చేరుకున్నారు అక్కడ ప్రజలు. దీంతో పేదరికంలో కూరుకుపోయిన ఆప్ఘన్ పౌరులు ఆకలి తీర్చుకునేందుకు కిడ్నీలను అమ్ముకుంటున్నారు. అసలే పేద దేశం.. ఇక తాలిబన్లు అధికారం చేపట్టిన అనంతరం.. అక్కడ ప్రజలు మరింత పేదవారిగా మారిపోయారు. కొన్ని లక్షల మంది ప్రజలు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. 3.89కోట్లకు పైగా జనాభా ఉన్న ఆప్ఘన్‌లో 59 శాతం జనాభా కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
ఆకలిని తీర్చుకోవాడికి కిడ్నీలను అమ్ముకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులతో తమ కుటుంబ సభ్యుల ఆకలిని తీరుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మానవ అవయవాల అక్రమరవాణా చట్ట విరుద్ధం.. కానీ ఆఫ్ఘన్ లో ఎటువంటి నియమ నిబంధనలు లేవు. దీంతో అక్కడ అధికారికంగానే వైద్యులకు తమ కిడ్నీలను అమ్ముతారు. అయితే ఇలా సేకరించి కిడ్నీలు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ ఇప్పటి వరకూ తెలియదు. దీంతో కచ్చితంగా ఆ దేశంలో గత ఏడాది నుంచి ఎంత మంది కిడ్నీలు అమ్ముకున్నారా చెప్పడం కష్టం.. అయితే గత కొన్నేళ్లుగా హెరాత్ ప్రావిన్స్‌లోనే వందల సంఖ్యలో కిడ్నీ తొలగింపు ఆపరేషన్లు జరిగాయని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు ఆర్థిక సమస్యలను గట్టెక్కడానికి కనీసం ఆహారం తినడానికి కిడ్నీ అమ్ముకోవడం ఒకటే మార్గం అని అనుకుంటున్నారు. దీంతో ఒక కిడ్నీతో బతుకీడుస్తూ మరో కిడ్నీని అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇక్కడ రోజు రోజుకీ అధికంగా పెరుగుతోంది. ముఖ్యంగా ‘షెన్‌షైబా బజార్’ గ్రామస్తులందరూ తమ కిడ్నీని అమ్ముకున్నవారే.. ఇక్కడ ప్రస్తుతం ఒక కిడ్నీతో జీవిస్తున్నవారే అధికమని తెలుస్తోంది.
ఇదే విషయంపై ‘షెన్‌షైబా బజార్’ గ్రామంలోని ఒక మహిళ మాట్లాడుతూ.. తన భర్త పని చేయడం లేదని.. అప్పులు ఉన్నాయని.. అందుకనే తన కిడ్నీని ఆఫ్ఘనిస్ ($2,900) మనదేశ కరెన్సీలో 250,000లకు అమ్మినట్లు చెప్పింది. మరొక స్త్రీ తన పిల్లలు అడుక్కుంటూ వీధుల్లో తిరుగుతున్నారని, తన కిడ్నీని అమ్మకపోతే.. ఏడాది వయసున్న కూతురిని అమ్మవలసి వస్తుందని వాపోయింది.
అయితే తాము కిడ్నీ ని అమ్ముకోవడం వలన ఒక్క కిడ్నీతో కష్టమైన పనులు చేయలేమని, కనీసం బరువులు కూడా ఎత్తలేమని.. దిక్కుతోచని స్థితికి చేరుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ‘వన్ కిడ్నీ విలేజ్’ పరిస్థితి నేపాల్‌లోని హోక్సే గ్రామస్థుల దీన స్థితిని గుర్తు చేస్తుందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆర్థికంగా ఘోరమైన పరిస్థితి ఉందనడానికి ఈ గ్రామం నిదర్శన మని అంటున్నారు.
Also Read:
Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో