AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని మోడీ భేటీ.. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

ద్వైపాక్షిక ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో సహా పలు అంశాలపై జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధవంతమైన చర్చలు జరిపారు.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని మోడీ భేటీ.. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ
Japan India Summit
Balaraju Goud
|

Updated on: Mar 19, 2022 | 8:10 PM

Share

India-Japan 14th annual summit: ద్వైపాక్షిక ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో సహా పలు అంశాలపై జపాన్ ప్రధాని(Japan PM) ఫ్యూమియో కిషిడా(Fumio Kishida)తో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శనివారం అర్ధవంతమైన చర్చలు జరిపారు. ఈమేరకు భారత ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ, ప్రధాని మోడీ జపాన్‌తో స్నేహాన్ని బలోపేతం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, కిషిదా మధ్య రసవత్తరమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారని పేర్కొంది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ మోడీ, కిషిదాల మధ్య జరిగిన చర్చల ఎజెండాలో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలు కూడా ఉన్నాయని తెలిపారు. 14వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని కిషిడా హాజరయ్యారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, చర్చల ఎజెండాలో పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని బాగ్చి తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మీడియా సలహా ప్రకారం, జపాన్ ప్రధాని ఆదివారం ఉదయం 8 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరుతారు. తన భారత పర్యటన ముగిసిన తర్వాత కిషిడా కంబోడియాకు వెళ్లనున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆమోదయోగ్యం కాదని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అలాంటి చర్యలను ఎప్పటికీ అనుమతించబోమని భారత్‌కు బయలుదేరే ముందు కిషిడా చెప్పారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత్, కంబోడియా నేతలతో కూడా చర్చిస్తానని జపాన్ ప్రధాని తెలిపారు. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021 అక్టోబర్‌లో కిషిడాతో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశాయి.

ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం కూడా జరుపుకోనుంది. మోడీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 2019లో గౌహతిలో జరగాల్సి ఉంది. అయితే, పౌరసత్వ సవరణ చట్టంపై విస్తృత నిరసనల కారణంగా రద్దు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత 2020 , 2021లో కూడా కోవిడ్ 19 మహమ్మారి కారణంగా నిర్వహించలేకపోయింది.

భారత్ జపాన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఇరు దేశాల నేతలు ప్రసంగించనున్నారు. ఈరోజు ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కిషిడా అధికారిక పర్యటనకు భారత్‌కు వచ్చారు. జపాన్ ప్రధాని అయిన తర్వాత ఫ్యూమియో కిషిడా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీతో జరిగే శిఖరాగ్ర సమావేశంలో, ద్వైపాక్షిక సంబంధాల వివిధ కోణాలను సమీక్షించడానికి, దానిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలను పరిశీలించడానికి ఇరుపక్షాలకు అవకాశం లభిస్తుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు తమ దౌత్య సంబంధాలు, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. మోడీ కిషిడా చర్చల్లో ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

రెండు దేశాల మధ్య చివరి శిఖరాగ్ర సమావేశం 2018లో టోక్యోలో జరిగింది. దీని తరువాత, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మరియు 2021 సంవత్సరాల్లో కూడా ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహించలేదు. డిసెంబర్ 2019లో, పౌరసత్వ సవరణ చట్టంపై విస్తృత నిరసనల నేపథ్యంలో గౌహతిలో ప్రధాని మోడీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ప్రతిపాదిత వార్షిక శిఖరాగ్ర సమావేశం రద్దైంది.

ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం పరిధిలో భారతదేశం జపాన్ బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయి. చాలా మంది నిపుణులు భారతదేశాన్ని మిత్రదేశంగా మరింత బలంగా అనుసంధానించాలని జపాన్ కోరుకుంటుందని భావిస్తున్నారు. దీని వెనుక కారణం భారతదేశం భారీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవరిచడమే. అదే సమయంలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చి గురువారం మాట్లాడుతూ, “వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరుపక్షాలకు అవకాశం కల్పిస్తుంది.” అని అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం వారి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

Read Also…. One Kidney Village: ఆకలి తీర్చుకోవడానికి అమ్మకానికి అవయవాలు… ఆ గ్రామంలో అందరూ ఒక్క కిడ్నీ ఉన్నవారే..