Japan PM Tour: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు భారత్‌లో ఘనస్వాగతం.. ప్రధాని మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కిషిడాకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘనంగా స్వాగతం పలికారు.
Japan PM Tour: జపాన్ ప్రధాని(Japan Prime Minister) ఫుమియో కిషిడా(Fumio Kishida) రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కిషిడాకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘనంగా స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఫుమియో కిషిడా.. ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దీంతో పాటు 14వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన నిక్కీ వార్తాపత్రిక తన పర్యటన సందర్భంగా కిషిదా భారతదేశంలో జపాన్ కంపెనీల ద్వారా ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుతుందని, మరింత ఆర్థిక సామర్థ్యాన్ని విస్తరణను ప్రకటించవచ్చని పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తన భేటీలో కిషిడా దాదాపు 300 బిలియన్ యెన్ల రుణాన్ని అంగీకరించే అవకాశం ఉంది. కార్బన్ తగ్గింపునకు సంబంధించిన ఇంధన సహకార పత్రంపై ఇరుపక్షాలు సంతకాలు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కిషిడా భారతదేశంలో 5,000 బిలియన్ యెన్ (US$42 బిలియన్) పెట్టుబడిని కూడా ప్రకటించవచ్చని వార్తాపత్రిక నివేదించింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, గతంలో ఆదేశ ప్రధాని షింజో అబే 2014లో ప్రకటించిన నిధులకు అదనంగా తాజా ప్రకటన ఉంటుందని పేర్కొంది.
Japanese Prime Minister Fumio Kishida arrives in Delhi on a two-day visit.
He will take part in the 14th India-Japan Annual Summit, besides holding bilateral talks with PM Narendra Modi.
Union Minister Ashwini Vaishnaw receives Fumio Kishida. pic.twitter.com/ORmRaSTwH3
— ANI (@ANI) March 19, 2022
భారతదేశం పట్టణీకరణ భాగంగా జపాన్ షింకన్‌సేన్ బుల్లెట్ రైలు సాంకేతికత ఆధారంగా హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తోంది. ఆర్థిక సదస్సు సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ నిధులను కూడా ప్రధాని కిషిడా ప్రకటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధాని శనివారం భారత్‌కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో, ద్వైపాక్షిక సంబంధాల వివిధ కోణాలను సమీక్షించడానికి, దానిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలను పరిశీలించడానికి ఇరుపక్షాలకు అవకాశం లభిస్తుంది. Read Also….