AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నోడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు.. క్షణాల వ్యవధిలోనే గట్టిగా ఇచ్చిపడేశాడు..!

Viral Video: హోలీ(Holi 2022) వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఈ వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు.

Viral Video: చిన్నోడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు.. క్షణాల వ్యవధిలోనే గట్టిగా ఇచ్చిపడేశాడు..!
Revange
Shiva Prajapati
|

Updated on: Mar 19, 2022 | 6:25 PM

Share

Viral Video: హోలీ(Holi 2022) వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఈ వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు. రంగులు జల్లుకుంటూ, చిందులేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, హోలీ రోజుల పెద్దల హంగామా కంటే పిల్లల హడావుడి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. వారు చేసే సందడి మామూలుగా ఉండదు. రంగులు చల్లుకునేందుకు విపరీతంగా పోటీ పడుతుంటారు. హోలీ రంగులు చల్లుకోవడంలో పిల్లలు తమ పైశాతికత్వాన్నంతా చూపిస్తుంటారు. తాజాగా ఓ పిల్లాడి హోలీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడి మామూలోడు కాదు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. వాడు ఆ రేంజ్‌లో తన రివేంజ్‌ను తీసుకున్నాడు మరి.

అవును.. సాధారణంగానే పిల్లలు తమ వద్ద హోలీ రంగులు అయిపోతే వేరేవారి వద్ద నుంచి లాక్కుంటుంటారు. ఇలాంటి పరిస్థితితే ఆ చిన్నోడిక ఎదురైంది. వాడి వద్ద ఉన్న రంగు అంతా అయిపోయింది. మిగతావారు ఆ చిన్నోడిపై రంగులు గుప్పిచారు. అతనిది కూడా లాక్కుని మరీ గుప్పారు. దాంతో ఏం చేయాలా? అని క్షణకాలం ఆలోచించి.. ఊహించని ప్రయోగం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన వద్ద రంగు నీరు లేకపోవడంతో.. నేరుగా డ్రైనేజీ నీటిని ఆ హోలీ స్ప్రే గన్‌లోకి ఎక్కించాడు. ఇకా చూసుకో నా సామిరంగ అంటూ.. అక్కడ ఉన్న వారందరిపైనా ఆ నీటిని స్ప్రే చేశాడు. ఆ బుడ్డోడి చర్యకు వారంతా షాక్ అయ్యారు. కొందరు వాడికి దొరక్కుండా పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సీన్‌ను అంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. బుడ్డోడి రివేంజ్ పీక్స్‌లో ఉందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. ‘చిన్నో మాంచి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. రివేంజ్‌ను తీసుకున్నాడు.’ అని కామెంట్స్ చేశారు పలువురు నెటిజన్లు. ‘ఇది నెక్ట్స్ లెవల్ హోలీ’ అంటూ మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సరదాగా వీడియోను మీరూ చూసేయండి మరి.

Also read:

Beauty Tips: వేసవిలో ముఖం మెరుపును కోల్పోయిందా?. అయితే ఈ ఆరెంజ్‌ ఫేషియల్‌ మీకోసమే..

Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..

Japan PM Tour: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు భారత్‌‌లో ఘనస్వాగతం.. ప్రధాని మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు