TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!

TSRTC: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను చక్కబెట్టేందుకు

TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!
Tsrtc
Follow us

|

Updated on: Mar 20, 2022 | 6:48 PM

TSRTC: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను చక్కబెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే.. తాజాగా బల్క్ యూజర్లకు పెరిగిన క్రూడాయిల్ ధరలతో మరింత అదనపు భారం పడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశంలో బల్క్ యూజర్లపై ఆ భారం పడింది. తెలంగాణ ఆర్టీసీపైనా అదనపు భారం పడింది. బల్క్ యూజర్లకు లీటర్ డీజిల్ ధర ఏకంగా 25 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 40 శాతం పెరగడంతో- బల్క్‌ యూజర్లకు ఇచ్చే ఇంధనం ధర పెంచేశారు. బల్క్ యూజర్లు అంటే ఆర్టీసీ, మాల్స్‌, ఎయిర్‌పోర్టులు వంటి పలురంగాల సంస్థలు ఉంటాయి. వీళ్లు సాధారణంగా నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేస్తారు.

బయట మార్కెట్‌లో ధరతో పోల్చితే ఆర్టీసీ ప్రత్యేక బంక్ లలో తక్కువకు లభించే డీజిల్. పెరిగిన ధరలతో బయట మార్కెతో పోల్చితే 7.38 రూపాయలకు ఆర్టీసీ బంక్‌లో డీజిల్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌‌లో డీజిల్ ధర 94.62 రూపాయలు. కాగా పెరిగిన బల్క్ యూజర్ మార్కెట్ డీజిల్ ధర 102 రూపాయలు. అంటే దాదాపు ఏడు రూపాయలకు పైనే ఉంది.

దాదాపు తెలంగాణ ఆర్టీసీ బస్సులు రోజుకి 33లక్షల కిలోమీటర్ల ప్రయాణానికి 8లక్షల లీటర్ల డీజిల్ అవసరం. 102 రూపాయలు బల్క్ యూజర్ మార్కెట్‌లో ఉండడంతో బయట మార్కెట్‌లో డీజిల్ వాడకం పెరిగింది. దీనితో లీటర్ డీజిల్‌కు ఏడూ రూపాయలు, బయట మార్కెట్‌లో ఆర్టీసీ బస్ డీజిల్ తీసుకోవడం వల్ల కమిషన్‌ల కింద లీటర్‌కు మరో నాలుగు రూపాయలు. మొత్తంగా లీటర్ డీజిల్‌కు 12 రూపాయల నష్టం తెలంగాణ ఆర్టీసీ భరిస్తుంది. అంటే దాదాపు తెలంగాణ ఆర్టీసీకి రోజుకి కోటి వరకు నష్టం ఈ పెరిగిన బల్క్ యూజర్ల క్రూడాయిల్ ధరల వల్ల.

అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇలా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదో రకంగా ఆర్టీసీని ఆదుకోవాలని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు.

Also read:

Viral Video: చిరుతపులి, బ్లాక్ పాంథర్ మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదిరిపోతాయి..!

Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..