Yadadri: భోజన ప్రియుడు లక్ష్మీనరసింహుడు.. రోజూ సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారంటే..
Yadadri: హిందూ పురాణాల(Hindu Mythology) ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి(Sri Vishnu) లోక పాలకుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగయుగాన అనేక అవతారాలను ఎత్తాడు. విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది..
Yadadri: హిందూ పురాణాల(Hindu Mythology) ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి(Sri Vishnu) లోక పాలకుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగయుగాన అనేక అవతారాలను ఎత్తాడు. విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి అవతారాల్లో ముఖ్యమైన అవతారాలను దశావతారాలని పేర్కొన్నాయి. ఈ దశావతారాల్లో నాల్గో అవతారం నారసింహావతారం. తన భక్తుడి రక్షణ కోసం విష్ణుడు సగం మనిషి, సగం మృగం ఆకారం దాల్చాడు. ఎన్నో ప్రత్యేకలు కలిగిన ఈ నారసింహుడికి .. శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని స్మరిస్తాము. అయితే లక్ష్మీనరసింహ స్వామీ భోజన ప్రియుడు. అందుకనే ఈ స్వామివారి సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ రకరకాల పదార్ధాలతో నైవేద్యం పెడతారు అర్చకులు. శుచిగా వండిన పదార్ధాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి.. ఆ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. ఈరోజు స్వామివారికి పెట్టె నైవేద్యాల వివరాల గురించి తెలుసుకుందాం..
- * లక్ష్మీనరసింహ స్వామి మొదటి నైవేద్యంగా పంచామృతాలు అందుకుంటారు. అనంతరం అభిషేకం సమయంలో నైవేద్యం తో పాటు తాంబూలం కూడా సమర్పిస్తారు.
- *ఉగ్ర రూపుడైన స్వామివారి శరీరంలోని వేడిని నియంతరించి చల్లబరిచే విధంగా రోజూ బ్రహ్మీ ముహర్త సమయంలో ఉదయం 5.30 గంటలకు దద్దోజనాన్ని నివేదిస్తారు. ఈ దద్దోజనం తయారీకి ఆవుపాల పెరుగు, శొంఠి, అల్లాన్ని ఉపయోగిస్తారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు.
- *స్వామివారికి మహా నైవేధ్య సమయం మద్యాహ్నం 12.00- 12.30 గంటలు. ఈ సమయంలో స్వామివారికి పులిహోర, శనగలు పోపు, లడ్డూలు, జిలేబీలు, వడలు, బజ్జీలు, పాయసం, క్షీరాన్నం, కేసరిబాత్ ను నివేదిస్తారు. దీనిని మహారాజ భోగం అని అంటారు.
- *మళ్ళీ సాయంత్రం స్వామివారి ఆరాధన అనంతరం పులిహోర, వడలు, దోసెలు, వడపప్పు, పానకాన్ని నివేదన చేస్తారు.
- * ప్రతి శుక్రవారం ఊంజల్ సేవ సమయంలో క్షీరాన్నం మహా నైవేద్యంగా సమర్పిస్తారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామీకి ప్రత్యేక పర్వదినాల్లోనూ, ప్రత్యేక పూజ సమయంలోనూ నైవేద్యం చేస్తారు. స్వామివారికి ఇలా నివేదన చేయడం వలన ఆయన ఆరగించి సంతుష్టుడు అవుతాడనీ.. తనను దర్శించే భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం. యాదాద్రిలో స్వామివారికి ఈ నైవేద్యాలన్నీ రామానుజ కూటమిలో అర్చకస్వాములు శుచిగా శుభ్రంగా సిద్ధం చేస్తారు.
Tirumala: తిరుమలలో విద్యుత్ ఆదాకు TTD కీలక నిర్ణయం.. ఈవో అధికారులతో సమీక్ష