AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russian Girl: ఆనారోగ్యాన్ని వరంగా మార్చుకున్న చిన్నారి.. ఏడేళ్ళకే ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న బాలికగా రికార్డు

Russian Girl: సాధారణంగా ఏడు, ఎనిమిదేళ్ల వయసులో పిల్లలేం చేస్తుంటారు? స్కూలుకెళ్లి చదువుకుంటారు.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తారు. అమ్మానాన్నల వద్ద మారాం చేస్తుంటారు..

Russian Girl: ఆనారోగ్యాన్ని వరంగా మార్చుకున్న చిన్నారి.. ఏడేళ్ళకే ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న బాలికగా రికార్డు
7 Year Old Russian Anastasi
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2022 | 6:33 PM

Russian Girl: సాధారణంగా ఏడు, ఎనిమిదేళ్ల వయసులో పిల్లలేం చేస్తుంటారు? స్కూలుకెళ్లి చదువుకుంటారు.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తారు. అమ్మానాన్నల వద్ద మారాం చేస్తుంటారు. అయితే పుట్టుకతోనే డిజార్డర్ ఉన్న ఓ బాలిక మాత్రం  ఏడేళ్లకే నెలకు కోటి రూపాయలు సంపాదిస్తుంది.. ఏడాదికి కోట్లు సంపాదిస్తూ రికార్డులు తిరగరాస్తుంది. అంతేకాదు  వరుసగా కొన్నేళ్ల నుంచి అత్యధిక వార్షికాదాయం పొందుతున్న చిన్నారి యూట్యూబర్( గా రికార్డులకెక్కింది. ఈ చిన్నారి తన యూట్యూబ్ చానెళ్ల(Youtube Channel) ద్వారా 2021లో అత్యధిక ఆదాయం పొందిన చిన్నారిగా రికార్డు సృష్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 చానెళ్లను ఆమె ఏకధాటిగా నిర్వహిస్తోంది.వాటిలో ముఖ్యమైనది ‘లైక్ నాస్త్య’( Like Nastya) అనే ఛానెల్‌. ఈ చానెల్ కు 8.6 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. మొత్తంగా ఆమె యూట్యూబ్ చానెళ్లకు 26 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఏడేళ్ల రష్యన్ బాలిక అనస్తాసియా రాడ్జిస్కాయ సోషల్ మీడియా స్టార్.  ఈ చిన్నారి వీడియోలకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిన్నారి ప్రతి నెలా  కోటి రూపాయల కంటే ఎక్కువగా సంపాదిస్తోంది. దీంతో ఈ చిన్నారి ఇప్పుడు  రూ.140 కోట్లకు పైగా ఆస్తులకు యజమాని. 2014లో పుట్టిన అనస్తాసియాకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి.. కుమార్తె కోసం లైక్ నాస్త్యా అనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఇది అనస్తాసియా కోసం విద్యా ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇప్పుడు చిన్నారి యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తిగా మారింది. గత సంవత్సరం ఈ చిన్నారి దాదాపు 200 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది.

ఇంత టాలెంట్‌ ఉన్న ఈ చిన్నారి చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీ అనే జబ్బుతో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల ఎప్పటికీ ఆమె మాట్లాడే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. చిన్నారిని ఎలాగైనా మాట్లాడించాలనే తపనతో 2015లో వారు ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించి.. చిన్నారితో మాట్లాడించే ప్రయత్నం చేశారట. అలా కొద్దిరోజుల్లోనే అనస్తాసియా మాట్లాడం నేర్చుకుందట. ఆ తర్వాతి ఏడాదే మరో చానెల్ ను పెట్టి మరింత ప్రోత్సహించారట. చిన్నచిన్నగా బొమ్మల రివ్యూను ఇవ్వడం ప్రారంభించారట. అలా అలా ఆమె సంపాదన మొదలుపెట్టింది. ఆమె అనారోగ్యమే ఆమెపట్ల వరంగా.. ఆదాయ వనరుగా మారింది. ఇప్పుడు అత్యధిక సంపాదన పొందిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది. అందుకే “ఏమి జరిగినా మన మంచికే’ అని పెద్దలు చెప్పే మాటలు వృథాపోవు. చేసే ప్రయత్నమూ వృథాపోదు.

Also Read: Viral: ఒకే వ్యక్తికి 500 పాముకాట్లు.. జనసముహంలోనూ అతడిపైనే ఎటాక్

Tirumala: తిరుమలలో విద్యుత్ ఆదాకు TTD కీలక నిర్ణయం.. ఈవో అధికారులతో సమీక్ష