Tirumala: తిరుమలలో విద్యుత్ ఆదాకు TTD కీలక నిర్ణయం.. ఈవో అధికారులతో సమీక్ష

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirupati).. ఎప్పుడూ భక్తుల రద్దీతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.  కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడి(Konetirayudu)ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ..

Tirumala: తిరుమలలో విద్యుత్ ఆదాకు TTD కీలక నిర్ణయం.. ఈవో అధికారులతో సమీక్ష
Tirumala Tirupati
Follow us

|

Updated on: Mar 20, 2022 | 6:00 PM

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirupati).. ఎప్పుడూ భక్తుల రద్దీతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.  కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడి(Konetirayudu)ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వస్తుంటారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే కాదు తిరుమల గిరులపైన కూడా అనేన దర్శనీయ స్థలాలున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి కొండకు చేరుకునే భక్తులు తిరుమల కొండపై అతిథి గృహాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో విద్యుత్ ఆదా చేయడం విషయంలో టీడీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొండమీద ఉన్న అన్ని అతిథి గృహాల్లో కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం  అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అతిథి గృహాల్లో కొత్త విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ వినియోగంలో బాధ్యత పెరిగి, విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. జూన్ 1వ తేదీనుంచి విద్యుత్ మీటర్ ల రీడింగ్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా ఈవో కు వివరించారు. తిరుమల అన్నదానం కాంప్లెక్స్ లో నెడ్ కాప్ ఆధ్వర్యంలో కొత్తగా స్టీమ్ సోలార్ కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇలా సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా 30 శాతం దాకా ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరగా చేపట్టాలని అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు.

తిరుమలలోని గెస్ట్ హౌస్ లు, కాటేజీల్లో రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేయడానికి గ్రీన్ కో సంస్థ ఉచితంగా సర్వే చేసి నివేదిక అందిస్తుందని ఈవో తెలిపారు. దీని ద్వారా దాదాపు 2. 5 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. తిరుమలలో రోడ్లు మరింతగా శుభ్రపరచడం కోసం ఆధునిక రోడ్డు క్లీనింగ్ మిషన్లు తెప్పించి శుభ్రతకు పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించారు. ఫిల్టర్ హౌస్ లతో పాటు ఇతర ప్రాంతాల్లోని 38 మోటార్లను మార్చి కొత్తవి బిగించడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని ఆయన అన్నారు.ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. తిరుపతి నుంచి తిరుమలకు విద్యుత్ బుస్సులు నడిపే విషయం గురించి ఈవో జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు.

Also Read :

Chanakya Niti: జీవితంలో సక్సెస్ మీ సొంతం కావాలంటే.. విద్యార్థి దశ నుంచి ఇలా చేయమంటున్న చాణక్య

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..