AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..

TTD Aarjitha Seva Tickets: కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది.

Tirumala:  శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..
Srivari Temple
Basha Shek
|

Updated on: Mar 20, 2022 | 11:05 AM

Share

TTD Aarjitha Seva Tickets: కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌ మొత్తం 3 నెలలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం తదితర సేవా టికెట్లను నేరుగా భక్తులకు అందుబాటులో ఉంచింది. వర్చువల్ క్యూ పద్ధతిలో ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయించనుంది. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం, టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో శ్రీవారి భక్తులకు కేటాయించనున్నారు. ఈమేరకు ఈరోజు నుంచి 22న ఉదయం 10 గంటల వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునేలా టీటీడీ అవకాశం కల్పించింది. టికెట్లు పొందిన వారి జాబితాను 22న ఉదయం 10 గంటల తరువాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కరోనా నిబంధనలు తప్పనిసరి..

కాగా కొవిడ్‌ కారణంగా 2020 మార్చి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు మళ్లీ సేవలను పునరుద్ధరించింది. ఏప్రిల్ 1నుంచి శ్రీ‌వారి ఆల‌యంలోఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఆర్జిత సేవా టికెట్లను భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. కాగా ప్రత్యేక రోజుల్లో అంటే పండుగలు, పర్వదినాల సమయంలో ఈ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Also Read:Viral Video: కళ్లను మాయ చేసే వింతలు.. పావురం నుంచి మనిషి కాలు వరకు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Bharti Singh: త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న భారతీ సింగ్‌.. ప్రెగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లాఫింగ్ క్వీన్‌..

Spinalonga Island: ఈ దీవి ఒకప్పుడు కుష్టు రోగులకు స్వర్గధామం !!