AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharti Singh: త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న భారతీ సింగ్‌.. ప్రెగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లాఫింగ్ క్వీన్‌..

ది కపిల్‌ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్‌ (Bharti Singh). ఆ షోలో లల్లీ అనే పాత్రతో నవ్వులు పూయించారామె. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉంటోన్న ఈ అందాల తార త్వరలోనే తల్లిగా కొత్త ప్రయాణం ప్రారంభించనుంది.

Bharti Singh: త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న భారతీ సింగ్‌.. ప్రెగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లాఫింగ్ క్వీన్‌..
Bharti Singh
Basha Shek
|

Updated on: Mar 20, 2022 | 10:10 AM

Share

ది కపిల్‌ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్‌ (Bharti Singh). ఆ షోలో లల్లీ అనే పాత్రతో నవ్వులు పూయించారామె. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉంటోన్న ఈ అందాల తార త్వరలోనే తల్లిగా కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమికుడు హర్ష్ లింబాచియాతో ఏడడుగులు నడిచిన ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. హోలీ పండగను పురస్కరించుకుని ఆమే ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన బేబీ బంప్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ఇక గతంలో ఎంతో బొద్దుగా ఉన్న భారతీ సింగ్‌.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడింది. దీంతో భారీగా బరువు తగ్గి నాజుకుగా మారిపోయింది. కాగా ప్రస్తుతం నిండు నిండు గర్భంతో ఉన్న ఆమె తన ప్రెగ్నెన్సీ (Pregnancy) గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గర్భం ధరించిన రెండు నెలల తర్వాత కానీ ఆ విషయం తెలుసుకోలేకపోయానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

నార్మల్‌ డెలివరీ కోసం ట్రై చేస్తున్నా!

‘నేను గర్భవతి అయినప్పుడు, రెండున్నర నెలల వరకు ఆ విషయాన్ని గుర్తించలేకపోయాను. ఇంట్లో రోజువారి కార్యకలాపాలను చేసుకుంటూనే సినిమా షూటింగ్‌లకు హజరయ్యాను. డాన్స్‌ దివానె షోలో డ్యాన్స్‌ కూడా చేశాను రోజూ ఏం తింటానే అదే ఆహారం తీసుకున్నాను. రన్నింగ్‌ చేశాను. ఇలా సుమారు రెండున్నర నెలలు పాటు నేను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయాను. ఈ క్రమంలో ఓ రోజు అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చింది. అప్పుడే నేను గర్భంతో ఉన్నానని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని హర్ష్‌కు చెప్పాను. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. త్వరలోనే మా తొలిబిడ్డను కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం. నార్మల్‌ డెలివరీ జరగాలనే కోరుకుంటున్నాను. ఇందుకోసం డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు రోజూ యోగా, తేలికపాటి ఎక్సర్‌ సైజులు చేస్తున్నాను. అలాగే దాదాపు అరగంట పాటు వాకింగ్‌ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ కామెడీ క్వీన్‌.

Also Read:Asian Billiards Champion Ship: ఫైనల్లో స్టార్‌ ప్లేయర్‌ని ఓడించి 8వ సారి టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ..

Spinalonga Island: ఈ దీవి ఒకప్పుడు కుష్టు రోగులకు స్వర్గధామం !!

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. మీ ఖర్చు తగ్గుతుంది..