AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

TTD Aarjitha Seva Tickets: కొవిడ్‌ కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిలిపివేసింది. అయితే ప్రస్తుతం కరోనా (Corona virus) వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..
Ttd
Basha Shek
|

Updated on: Mar 20, 2022 | 10:57 AM

Share

TTD Aarjitha Seva Tickets: కొవిడ్‌ కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిలిపివేసింది. అయితే ప్రస్తుతం కరోనా (Corona virus) వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు మళ్లీ సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1నుంచి శ్రీ‌వారి ఆల‌యంలోఆర్జిత సేవ‌లు (Aarjitha Seva Tickets) తిరిగి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ మొత్తం 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం (మార్చి 20న) ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనుంది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తారు. టికెట్లు పొందిన వారి జాబితాను 22న ఉదయం 10 గంటల తరువాత టీటీడీ  వెబ్ సైట్ ద్వారా వెల్లడించనుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు సేవల ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పర్వదినాల్లో సేవల రద్దు..

ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. అయితే ప్రత్యేక రోజుల్లో అంటే పండుగ సందర్భాల్లో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Also Read:Benefits Of Tamarind: చింతపాండు తింటే బరువు తగ్గుతారానేది నిజమేనా..

Sanjay Raut: వారిది చీకటి ఒప్పందం.. ఎంఐఎంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Edible Oil: సామాన్యులకు శుభవార్త..! వంట నూనెల ధరలు తగ్గుతాయా..