AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Tamarind: చింతపండు తింటే బరువు తగ్గుతారానేది నిజమేనా..

ప్రస్తుత జీవనవిధానంతో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు...

Benefits Of Tamarind: చింతపండు తింటే బరువు తగ్గుతారానేది నిజమేనా..
Tamarind
Srinivas Chekkilla
|

Updated on: Mar 20, 2022 | 7:14 AM

Share

ప్రస్తుత జీవనవిధానంతో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. అయితే పలు పదార్థాలు తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేస్తే బరువు తగ్గొచ్చు. బరువు తగ్గించేందుకు తీసుకున్న ఆహారాల్లో చింతపండు ఉందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.

చింతపండులో మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందట.

చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనితో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Health: వేసవిలో ఆరోగ్యం కోసం గ్రీన్ సలాడ్.. ఈ మూడు సమస్యలకి చక్కటి పరిష్కారం..!