Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fenugreek Seeds: మెంతులలో అద్భుత ఔషధగుణాలు.. ఈ వ్యాధులని నయం చేయడంలో సూపర్..!

Fenugreek Seeds: భారతీయులు ప్రాచీన కాలం నుంచి కూరలలో మెంతి పౌడర్‌ని వాడుతున్నారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో దీనికి

Fenugreek Seeds: మెంతులలో అద్భుత ఔషధగుణాలు.. ఈ వ్యాధులని నయం చేయడంలో సూపర్..!
Fenugreek Seeds
Follow us
uppula Raju

|

Updated on: Mar 20, 2022 | 5:52 AM

Fenugreek Seeds: భారతీయులు ప్రాచీన కాలం నుంచి కూరలలో మెంతి పౌడర్‌ని వాడుతున్నారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేద పండితులు మెంతులని ఎన్నో వ్యాధులని నయం చేయడంలో ఉపయోగించేవారు. మందుల తయారీలో వాడేవారు. ఇప్పటికి ప్రతి ఒక్కరి వంటింట్లో మెంతులు ఉంటాయి. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, సోడియం వంటి అనేక మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు బరువుని తగ్గిస్తాయి. స్థూలకాయంతో బాధపడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గించుకోలేకపోతున్నారు. మెంతులు తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. దీని కోసం మీరు మెంతులతో తయారుచేసిన టీ తీసుకోవచ్చు. మెంతి టీ చేయడానికి ముందుగా ఒక చెంచా మెంతి పొడిని వేడి నీటిని కలపాలి. కాసేపు మరగబెట్టి వడపోసి అందులో కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి. అవసరమనుకుంటే కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రింక్‌ని ఉపయోగించడం వల్ల పెరుగుతున్న మీ బరువు అదుపులో ఉంటుంది.

శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మెంతి గింజలను వాడాలి. మెంతులలో పెద్ద మొత్తంలో ఐరన్ ఉంటుంది. మీ శరీరంలో కూడా ఐరన్ లోపం ఉంటే మొలకెత్తిన మెంతి గింజలను ఉపయోగించవచ్చు. మెంతి గింజలను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. నేటి కాలంలో సమయానికి పీరియడ్స్ రాకపోవడం అనేది ఏ అమ్మాయికైనా చాలా పెద్ద సమస్య. ఇలాంటి సమయంలో మెంతులని ఉపయోగించవచ్చు. ఇది శరీరంలో రక్త ప్రసరణను సాధారణీకరిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలా చేస్తుంది. మొలకెత్తిన మెంతులు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కడుపు జీర్ణశయాంతర వ్యవస్థను క్లీన్ చేయడంలో సహాయపడుతాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..