AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..
Cm Kcr
uppula Raju
|

Updated on: Mar 19, 2022 | 11:09 PM

Share

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం భావిస్తున్నారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో నిమగ్నమైంది. ఏ క్షణంలోనైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేసే ముందు వయో పరిమితి గురించి అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా ప్రభుత్వం వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

80వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వయో పరిమితిని పెంచుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణగా సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో పరిమితి పెంపు వర్తించదు. పాత పద్దతిలోనే కొనసాగుతాయి.

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Rahul Gandhi: ద్వేషం, కోపం రంగాల్లోనూ భారతదేశానికి త్వరలోనే అగ్రస్థానం.. కేంద్రంపై రాహుల్ వంగ్యాస్త్రాలు!