Health: వేసవిలో ఆరోగ్యం కోసం గ్రీన్ సలాడ్.. ఈ మూడు సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Health: ఎండాకాలంలో సలాడ్ అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందుకే ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన

Health: వేసవిలో ఆరోగ్యం కోసం గ్రీన్ సలాడ్.. ఈ మూడు సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Green Salad
Follow us
uppula Raju

|

Updated on: Mar 20, 2022 | 5:55 AM

Health: ఎండాకాలంలో సలాడ్ అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందుకే ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ సలాడ్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరోవైపు వేసవిలో సలాడ్ ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. గ్రీన్‌ సలాడ్‌ని బచ్చలికూర, క్యాబేజీ, దోసకాయ వంటి ఆకుకూరలతో తయారుచేస్తారు. ఇందులో క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయలు కూడా కలుపుతారు. సలాడ్ తయారు చేసిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్‌ చేస్తారు. గ్రీన్ సలాడ్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

1. కళ్లకు మేలు చేస్తుంది: గ్రీన్‌ సలాడ్‌ కళ్లకి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో క్యారెట్ ఉంటుంది. దీనివల్ల బీటా కెరోటిన్ అనే విటమిన్ లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు ఆహారంతో పాటుగా సలాడ్ తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.

2. అలసటను దూరం చేస్తుంది: క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకు కూరలతో తయారు చేసిన సలాడ్ తీసుకోవడం వల్ల అలసట తొలగిపోతుంది. ఇందులో విటమిన్ బి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అలసటను దూరం చేయడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కూరగాయలు ఏదో ఒక రూపంలో తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.

3. పొట్టకు మేలు చేస్తుంది: వేసవిలో ప్రజలు తరచుగా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతారు. గ్రీన్ సలాడ్‌లో ఉండే పదార్థాలు పొట్టకి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. గ్రీన్ సలాడ్‌లో విటమిన్లు A, B1, B6, C, ఐరన్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో 90 శాతం నీరు లభిస్తుంది. దోసకాయను గ్రీన్ సలాడ్‌లో భాగం చేయడం వల్ల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నీటి కొరత ఉండదు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!