Viral: ఒకే వ్యక్తికి 500 పాముకాట్లు.. జనసముహంలోనూ అతడిపైనే ఎటాక్
పాములు నిజంగా పగబడతాయా..? నిపుణులు అయితే అలాంటిది ఏమి ఉండదని కొట్టిపారేస్తారు. కానీ మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కథ వింటే.. పాములు పగతో వెంటాడతాయ్ అని అనిపిస్తుంది.
Maharashtra: పాములు నిజంగా పగబడతాయా..? నిపుణులు అయితే అలాంటిది ఏమి ఉండదని కొట్టిపారేస్తారు. కానీ మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కథ వింటే.. పాములు పగతో వెంటాడతాయ్ అని అనిపిస్తుంది. అందుకు కారణం అతడిని పదే.. పదే పాము కాటేయడం. అవుసా పట్టణంలో నివశించే అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తి గత 15 ఏళ్లలో దాదాపు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు. ఇతడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లినప్పుడు చాలాసార్లు పాము కాటుకు గురయ్యాడు. అయితే పొలాల్లో పాములు ఉండటం కామన్ అనుకోవచ్చు. కానీ బయట జనసముహంలో ఉన్నప్పుడు కూడా పాముకాటుకు గురయ్యారు. అతడిని పాములు ఎందుకు కాటేస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. అదృష్టవశాత్తూ.. అతడికి ఇంతవరకూ ప్రాణాపాయం జరగలేదు. పాము కాటు వేసిన వెంటనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇన్ని సార్లు పాములు కాటు వేయడం వల్ల అతడి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. పాములు పగబట్టవని పక్కాగా చెప్పే డాక్టర్లు సైతం… ఇతడిని ఇన్నిసార్లు పాములు కాటేయడానికి కారణాలేంటనే విషయాన్ని విశ్లేషించలేకపోతున్నారు. ఈ కేసు తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.
Also Read: Andhra Pradesh: వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేతలు.. త్వరలో సిద్దార్థ్-జశ్వంతిల నిశ్చితార్థం