Football Gallery Collapse: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో..
గాయపడిన వారిని వండూరు పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ముగ్గురిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.
ఫుట్‌బాల్(Football) మైదానంలో ఘోర ప్రమాదం జరిగింది.కేరళలోని వండూర్ (Wandoor) లోని మల్లాపురం నగరంలో శనివారం రాత్రి జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందులో కొందరు గాయపడ్డారు. కలికావు-వాండూరు రోడ్డులో ఉన్న పుంగోడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. ఈ సెవెన్ ఫుట్‌బాల్ (Seven Football Match) మ్యాచ్ కోసం గ్యాలరీని నిర్మించారు. మ్యాచ్ జరగుతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు గాయపడ్డారు. ది హిందూ అనే ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం , గాయపడిన వారి పరిస్థితి అంత విషమంగా లేదు.
గాయపడిన వారిని వండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ముగ్గురిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన రాత్రి 9:30 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పుడు గ్యాలరీలో 1000 మంది ఉన్నారు.
స్థానికుల ప్రకారం, మైదానంలోని గ్యాలరీని సరిహద్దు చెక్కతో తయారు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం కురుస్తుండడంతో ఈ గ్యాలరీ ఒత్తిడికి గురైంది. దీంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన పలువురికి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే, చాలామందికి మాత్రం అంత తీవ్రమైన గాయాలు కాలేదు.
ఈ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలో ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా గ్యాలరీ కూలిపోయింది. మైదానంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం జరిగిన నగరాన్ని ఫుట్‌బాల్ క్రేజీ సిటీ అని పిలుస్తారు. ఈ మ్యాచ్‌ను చూడటానికి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇందులో పలువురు చిన్నారులు కూడా గాయపడ్డారు. నివేదిక ప్రకారం, సుమారు 200 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అయితే ఎవరి పరిస్థితి విషమంగా లేదు.
Shocking visual! Over 60 people are feared to be injured after the makeshift gallery of a football stadium collapsed near Wandoor in north Kerala district late Saturday evening. (PTI) pic.twitter.com/M7H6PuYRaE
— Janardhan Koushik (@koushiktweets) March 20, 2022
Also Read: Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?
IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?