భారీ అంచనాలు.. అధిక ఒత్తిడి.. అయినా ఆకట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్..

19 సంవత్సరాల వయస్సులో, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికీ అనుభవం లేనివారుగానే గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ కీర్తి కోసం వారి అన్వేషణలో మరిన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని వారికి తెలుసు.

భారీ అంచనాలు.. అధిక ఒత్తిడి.. అయినా ఆకట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్..
All England Open Gayatri Gopichand Pullela
Follow us

|

Updated on: Mar 20, 2022 | 7:28 PM

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ (All England Open)ఛాంపియన్‌షిప్‌లో , లక్ష్యసేన్ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించగా, మరోవైపు సెమీ ఫైనల్స్‌లోనే మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్(Gayatri Gopichand Pullela), త్రిసా జాలీ(Treesa Jolly)ల ప్రయాణం ముగిసింది. చైనా జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైనా భారత్ యువ జోడీ ఆకట్టున్నారు. కానీ, విజయం సాధించలేకపోయారు. కానీ, ఆల్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకున్న మొదటి భారతీయ జంటగా చరిత్ర సృష్టించారు.  ఫైనల్ చేరాలన్న భారత యువ జంట కలను చైనీస్ జోడీ ఛేదించింది. కేవలం 51 నిమిషాల్లోనే చైనా జోడీ చేతిలో ఓడి భారత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు గేమ్‌లు సాగిన ఈ మ్యాచ్‌లో చైనా జోడీ 21-17, 21-16 తేడాతో విజయం సాధించింది. త్రిసా జాలీ, గాయత్రీ గోపీచంద్‌లు శుక్రవారం కొరియా రెండో సీడ్‌లు లీ సోహీ, షిన్‌ సెంగ్‌చాన్‌లను ఓడించారు. 46వ ర్యాంక్‌లో ఉన్న త్రిసా-గాయత్రి జోడీ 14-21, 22-20, 21-15తో లీ, షిన్‌లపై విజయం సాధించి, ఆల్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకున్న మొదటి భారతీయ జంటగా చరిత్ర సృష్టించారు. ఆల్ ఇంగ్లండ్‌లో డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు పతకం రాలేదు.

అయితే, టోర్నమెంట్‌లో ప్రారంభ రౌండ్‌లకు మించి ఈ జోడీ ముందుకు వెళ్తారని ఊహించి ఉండరు. కానీ, వారు తమ పోరాటాన్ని ఎంతో అనుభవజ్ఞులైన ప్రత్యర్థులపై చూపించి, సెమీస్‌కు చేరుకున్నారు. సెమీస్‌కు చేరుకున్న తర్వాత వైల్డ్‌ సెలబ్రేషన్‌ కూడా ఈ యువ కాంబినేషన్‌కి సమానంగా ఉండేది.

ఇది వీరి సమిష్టి కృషితో విజయాన్ని దక్కించుకున్నా.. ఆ తరువాత ముందుకు వెళ్లలేకపోయింది. 2001లో గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, 21 సంవత్సరాల తర్వాత ‘గోపీచంద్’ కుటుంబ సభ్యురాలైన గాయత్రి సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచి వారి వృత్తినే కొనసాగించడం అంత సులభం కాదు. రోహన్ గవాస్కర్ నుంచి అర్జున్ టెండూల్కర్ వరకు, ప్రతి ఒక్కరూ వారి వెనుక ఉన్న పేరు స్థిరమైన పేరు, ఎన్నో అంచనాలతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. వారికి శిక్షణ ఇవ్వడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడడం ఎంతో కష్టంగా మారుతుంది. ఎందుకంటే అప్పటికే వారిపై వారి తల్లిదండ్రులు తెచ్చి పెట్టిన సెలబ్రిటీ అనే హోదా ఇందుకు అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది.

జూనియర్ ఇండియన్ సర్క్యూట్‌లో ర్యాంక్ వచ్చినప్పటి నుంచి.. చీఫ్ కోచ్ గోపీచంద్, ఒలింపియన్ తల్లి పీవీవీ లక్ష్మిల కుమార్తె అయిన గాయత్రి ఆటను అందరూ చూడాలనుకుంటారనడంలో సందేహం లేదు. గాయత్రి తల్లి లేదా అమ్మమ్మ ఆమెను మీడియా దృష్టికి దూరంగా ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు. ఆమె బయటకు వెళ్లి ఆడుకోవడం ఆనందించవచ్చు. కానీ, అలా చేస్తే ఆమెపై ఎంతో ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే, గాయత్రి 12 సంవత్సరాల వయస్సులో, జక్కా వైష్ణవి రెడ్డితో కలిసి రెండు U-17 ఆల్ ఇండియన్ గర్ల్స్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి అంచనాల ఒత్తిడి పెరగడం ప్రారంభించింది.

ప్రదర్శన విశ్వసనీయంగా ఉన్నప్పటికీ, చీఫ్ కోచ్ గోపీచంద్ తన కుమార్తె విజయం కోసం భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకున్నారనే దానిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ కలయిక ఎక్కువ కాలం కొనసాగలేదు. గాయత్రి వేర్వేరు భాగస్వాములతో డబుల్స్ ఆడుతూ సింగిల్స్‌పై దృష్టి పెట్టింది. 2018 ఆసియా క్రీడల జట్టుకు ఆమెను ఎంపిక చేయడంతో మరో వివాదం చెలరేగింది. పీవీ సింధు తండ్రి పీవీ రామన్న కూడా గోపీచంద్‌పై బంధుప్రీతి ఉందని పరోక్షంగా ఆరోపిస్తూ సెలెక్టర్లు ఇద్దరు అదనపు సింగిల్స్ ప్లేయర్‌లకు బదులుగా అదనపు డబుల్స్ జోడీని ఎంపిక చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఇలాంటి టైంలో ఒక సంవత్సరం తర్వాత గాయత్రి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో డబుల్స్ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా తనేంటో నిరూపించుకుంది. అయితే అప్పటికే ఆమె ‘గోపీచంద్’ పేరు, దానితో వచ్చిన అనేక అంచనాల ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించింది. గాయాలు కూడా ఆమెకు సహాయం చేయలేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె జోడీ ఎక్కువగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె తన దృష్టిని డబుల్స్‌పై కేంద్రీకరించాలని నిర్ణయించుకుంది.

గాయత్రికి జోడీని నిర్ణయించే విషయానికి వస్తే, కోచ్‌లు రుతుపర్ణ పాండా వంటి సీనియర్‌కు బదులుగా జూనియర్ ప్లేయర్‌ను ఎంచుకుని షాకిచ్చారు. రెండేళ్ల విరామం తర్వాత సుదీర్‌మన్ కప్, థామస్/ఉబెర్ కప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో, వారు మూడో స్థానంలో నిలిచారు. కొంతమంది ఆటగాళ్ళు జట్టులోకి వచ్చేందుకు ఈ ఫార్మాట్‌ను రూపొందించారని ఆరోపించడంతో అదెన్నో వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.

గాయత్రి, ఆమె తండ్రి గోపీచంద్ ఇద్దరూ ఈ ఆరోపణలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాకెట్ మాట్లాడే వరకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉండాలని కోరుకున్నారు.

గాయత్రి, ట్రీసాల జోడీ ఈ సంవత్సరాన్ని రష్యాకు చెందిన జోడీ అనస్తాసియా ప్రోజోరోవ్సా, వలేరియా రుకాకోవాలపై మొదటి రౌండ్‌లో తలపడి విజయంతో ఆకట్టుకున్నారు. అయితే ట్రీసా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో తదుపరి రౌండ్ నుంచి వైదొలగవలసి వచ్చింది.

గాయత్రీ, ట్రీసా ఆ తరువాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా ఆకట్టుకున్నారు. ఆవెంటనే ఒడిషా ఓపెన్ సూపర్ 100 టైటిల్‌ను గెలుచుకుని సత్తా చాటారు. అయితే, దేశంలో కోవిడ్ మహమ్మారి మూడో వేవ్ కారణంగా ఈ రెండు టోర్నమెంట్‌లలో పోటీ స్థాయిని బట్టి, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను సవాలు చేయలేరంటూ, వారి సామర్థ్యంపై ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నారు.

19 సంవత్సరాల వయస్సులో, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికీ అనుభవం లేనివారుగానే ఉన్నారు. అంతర్జాతీయ కీర్తి కోసం వారి అన్వేషణలో మరిన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని వారికి తెలుసు. అయితే అరేనా బర్మింగ్‌హామ్‌లోని ప్రదర్శనతో గాయత్రి తన తండ్రి నీడ నుంచి బయటకు రావడానికి, కోర్టులో తన సామర్థ్యాలతో పూర్తిగా అంతర్జాతీయ సర్క్యూట్‌లో తనను తాను నిరూపించుకోవడంలో సహాయపడుతుంది.

ఇది ఈ జోడీపై ఒత్తిడిని తగ్గించి, మరింత స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పిస్తుంది. ప్రకాశవంతమైన భవిష్యత్తుకు సంబంధించి, అలాగే ఇది కచ్చితంగా భారత మహిళల డబుల్స్‌కు ఒక మెట్టులా ఉంటుందని తెలుస్తుంది.

Also Read: Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో సూపర్బ్ క్యాచ్.. చూశారంటే షాకే.. వైరల్ వీడియో

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..

Latest Articles
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి