Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?

భారత్ తన తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. దీని తర్వాత చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది.

Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?
Icc Womens World Cup 2022 Team India Semi Final Chances
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Mar 21, 2022 | 5:15 PM

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(Icc Women World Cup 2022) లో ఆస్ట్రేలియా జట్టు మొదటి సెమీ-ఫైనలిస్ట్‌గా తన టిక్కెట్‌ను కన్మ్‌ఫాం చేసుకుంది. అంటే ఇప్పుడు కేవలం మరో మూడు టీంలకు మాత్రమే సెమీ ఫైనల్ చేరే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఏడు టీంలు పోటీపడుతున్నాయి. ఇందులో భారత జట్టు(Team India Women’s) కూడా ఉంది. ప్రశ్న ఏమిటంటే, అసలు భారత్‌కు సెమీ-ఫైనల్‌ చేరే అవకాశం ఉందా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇందుకు టీమిండియా ప్రదర్శనతోపాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం తరచుగా జరుగుతుంది. అయితే అంతకుముందు టీమిండియా మాత్రం తన చివరి రెండు మ్యాచులను గెలవాల్సి ఉంటుంది. భారత జట్టు సెమీఫైనల్ ఆడుతుందా.. లేక టోర్నీ నుంచి నిష్క్రమించేనా.. అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ భారత్ సెమీఫైనల్ ఆడాల్సి వస్తే ఓటమి అనేది మరచిపోవాలి. అంటే ఇప్పటి వరకు భారత్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది. ఇప్పుడు మరో మ్యాచులో ఓడితే మరిన్ని సమస్యలు సృష్టించవచ్చు. అంటే, ఇలాంటి పరిస్థితిలో విజయం ఒక్కటే భారత్ ముందున్న మార్గంగా నిలిచింది.

భారత్ ఓడిపోతే కష్టమే..

టోర్నీలో భారత్ తన ఆరో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. దీని తర్వాత చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. అంటే మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీకొనాల్సి ఉంది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్ ఆడాలంటే, భారత జట్టు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా రెండింటినీ ఓడించాలి. అంటే వీరిద్దరిపై విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.

బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా టీంలపై భారత్‌ రికార్డు..

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో పోటీపడటం భారతదేశానికి ఈజీగా లేదా కష్టంగా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్‌తో భారత్ ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడగా, 100 శాతం విజయం సాధించింది. అంటే మొత్తం 4 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. ఈ దృక్కోణంలో మార్చి 22న బంగ్లాదేశ్‌పై భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో 27 వన్డేలు ఆడగా, అందులో భారత్ 15 విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా 11 సార్లు గెలిచింది. అదే సమయంలో, ఇద్దరి మధ్య 1 మ్యాచ్ టైగా నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా ఇటీవలి ఫామ్‌ను బట్టి భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉంటేనే భారత్‌ దక్షిణాఫ్రికాను ఓడించి సెమీఫైనల్‌కు టిక్కెట్టును దక్కించుకోగలదు.

Also Read: IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?