IPL 2022: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు?

ఐపీఎల్ 15వ సీజన్(IPL 2022) ప్రారంభం కాకముందే అభిమానులకు ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. టోర్నమెంట్ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు?
Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: Mar 20, 2022 | 2:23 PM

ఐపీఎల్ 15వ సీజన్(IPL 2022) ప్రారంభం కాకముందే అభిమానులకు ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. టోర్నమెంట్ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంతకుముందు 25 శాతం మంది ప్రేక్షకులకు ఎంట్రీని ఇవ్వాలని బీసీసీఐ(BCCI) నిర్ణయించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ అనుమతిని ఉపసంహరించుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి, రాష్ట్రంలో కోవిడ్ -19 కొత్త ముప్పు గురించి కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇది ఐపీఎల్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఏఎన్ఐతో మాట్లాడుతూ- అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు లేఖ వచ్చింది. యూరోపియన్ దేశాలు, దక్షిణ కొరియా, చైనాలో కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ జారీ చేసింది. అయితే, ఐపీఎల్ మ్యాచ్‌లపై మేం ఇప్పుడే వ్యాఖ్యానించదలుచుకోలేదు అంటూ పేర్కొన్నారు.

లీగ్‌లోని మొత్తం 70 మ్యాచ్‌లు మహారాష్ట్రలోని రెండు నగరాలు, ముంబై (వాంఖడే, బ్రాబోన్, డివై పాటిల్ స్టేడియం), పూణే (MCA స్టేడియం)లో జరుగుతాయి. IPL 2022 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మార్చి 26న జరగనుంది.

మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది.

Also Read: IPL 2022: మార్క్ వుడ్ స్థానంలో లక్నో జట్టులో చేరేది వీరే.. లిస్టులో మిస్టర్ ఐపీఎల్?

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..