Andhra Pradesh: వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేతలు.. త్వరలో సిద్దార్థ్-జశ్వంతిల నిశ్చితార్థం
ఏపీలో ఒకే పార్టీకి చెందిన మరో ఇద్దరు రాజకీయ నాయకులు వియ్యంకులు కాబోతున్నారు. టీడీపీ నేతలు బొండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు ఒక్కటవ్వబోతున్నాయి.
ఏపీలో మరో ఇద్దరు రాజకీయ నాయకులు వియ్యంకులు కాబోతున్నారు. టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి‘(Av Subba Reddy) కుమార్తె జశ్వంతితో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా(Bonda Uma) కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరగనుంది. ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఇంటికి వెళ్లి ఈ శుభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సిద్ధార్థ్, జశ్వంతి అమెరికాలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆపై ఆ ఇష్టం ప్రేమగా మారింది. జనవరిలో పెద్దలకు విషయం చెప్పడంతో.. వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన వీరి వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పార్టీల నేతలు హాజరవ్వనున్నారు. ఏపీలో ఈ కల్చర్ కొత్తేం కాదు. ఈ మధ్యనే వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. గతంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ వియ్యంకులు అయిన విషయం తెలిసిందే.
త్వరలో జరగనున్న మా నిశ్చితార్థం మరియు పెళ్లి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు @ncbn గారిని Bonda Siddhartha, మా నాన్న @IamAVSubbaReddy గారు, మామయ్య @Bondauma_MLA గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది. pic.twitter.com/NjjqcSt69F
— AV Jashwanthi Reddy (@AvJashwanthi) March 19, 2022
Also Read: Shocking: ఆటోపైకి వాటర్ బెలూన్ విసిరిన ఆకతాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకే