Chicken Prices: ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్.. రేటు తెలిస్తే ముద్ద దిగడమూ కష్టమే

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగని వాళ్లు ఎందరో. వారందరికీ ఇది నిజంగా చేదు వార్తే. చికెన్ (Chicken) కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యులకు...

Chicken Prices: ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్.. రేటు తెలిస్తే ముద్ద దిగడమూ కష్టమే
Chicken Skin On
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 20, 2022 | 4:41 PM

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగని వాళ్లు ఎందరో. వారందరికీ ఇది నిజంగా చేదు వార్తే. చికెన్ (Chicken) కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. ఫలితంగా కిలో కొనే వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు (Prices) విపరీతంగా పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.300కు చేరింది. గత నెలలో రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు పెరిగింది. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. ఇక, హైదరాబాద్‌లో 290 నుంచి 310 వరకు లభిస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ఇబ్బందులు పడుతున్న జనానికి చికెన్ ధరల పెరుగుదల గుదిబండలా మారింది. చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఫౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం, ఫారాల్లో కొత్త జాతులు అందుబాటులోకి రాకపోవడంతో కోళ్ల ధరలు పెరిగాయని చెబుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు, బర్డ్ ఫ్లూ వదంతుల కారణంగా కోళ్ల లభ్యత తక్కువగా ఉందని ఫారం నిర్వాహకులు అంటున్నారు. సాధారణ రోజుల్లో ఎండాకాలంలో (Summer) చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి పక్షులు చనిపోవడంతో పూర్తి బరువు రాకముందే వాటిని విక్రయిస్తారు. దాంతో కిలో కోడిమాంసం ధర గతంలో రూ.160 నుంచి రూ.180 పలుకేది. కానీ ఈసారి పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. కాబట్టి, ధరలు పెరిగాయి.

ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయి. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. కోడి ధర పెరిగినా తాము నష్టాలు ఎదుర్కొంటున్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాయిలర్‌ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్‌ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్‌ ధర పెరిగింది. మార్కెట్ లోకి కొత్త జాతులు, దాణాల రేట్లు తగ్గితే గానీ చికెన్ రేట్లు తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read

Sunny Leone: షాకిస్తున్న సన్నీ రెమ్యునరేషన్.. మంచు విష్ణు సినిమాకోసం అమ్మడు అంత అందుకోనుందట..

T.Congress: కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి ఏం తేల్చారంటే?

Megastar Chiranjeevi: మెగాస్టార్ స్పీడ్ మాములుగా లేదుగా.. లైన్ లోకి మరో మలయాళ రీమేక్‌!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే