Megastar Chiranjeevi: మెగాస్టార్ స్పీడ్ మాములుగా లేదుగా.. లైన్ లోకి మరో మలయాళ రీమేక్!
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. యువహీరోలకు ధీటుగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. యువహీరోలకు ధీటుగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఇవికాక కే.ఎస్.రవీంద్ర, వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ మెగాస్టార్ సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే మరో మలయాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరంజీవి (Chiranjeevi) ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే మలయాళ సూపర్‌స్టార్లు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి నటించిన బ్రోడాడీ (Bro Daddy). ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మంచి స్పందనే వచ్చింది. రెండు కుటుంబాల మధ్య సాగే పంతాలు, పట్టింపుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది తెలియదు. మరోవైపు బ్రోడాడీ రీమేక్‌పై అటు చిరంజీవి కానీ, అటు నిర్మాణ సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.
కాగా చిరంజీవి ఇప్పటికే మలయాళ లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన లూసిఫర్‌లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్రలో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా బ్రోడాడీలో కూడా ఇక మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. మీనా, కల్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి కూడా పృథ్వీరాజే దర్శకత్వం వహించారు. ఇక పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో భీమ్లానాయక్ గా రీమేకైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
Also Read: Egg Benefits: నాటుకోడి గుడ్లు మంచివా లేక ఫారం కోడి గుడ్లు మంచివా..
Surety Bonds: ష్యూరిటీ బాండ్స్ అంటే ఏమిటి.. ఇవి చిన్న కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారనున్నాయా..!
Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..