- Telugu News Photo Gallery This Eggy Quinoa Bowl Is Loaded With Heart, Gut, and Brain Health Benefits
Egg Benefits: నాటుకోడి గుడ్లు మంచివా లేక ఫారం కోడి గుడ్లు మంచివా..
ఈ ప్రపంచంలో.. మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా.? సమాధానం ఒక్కటే! గుడ్డు!
Updated on: Mar 20, 2022 | 11:58 AM

గుడ్డు బయోలాజికల్ విలువ నూటికి నూరు! మరే పదార్ధానికీ ఇంటి సంపూర్ణ విలువ లేదు. ఒక గ్రాము మాంసకృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదనేది 'ప్రోటీన్ ఎఫిషియెన్సీ రేషియో' అంటారు.

గుడ్డులోని ప్రోటీన్లను సంపూర్ణ మాంసకృత్తులంటారు. పప్పులు, బియ్యం, గోధుమల్లో ఉండే ప్రోటీన్ నాణ్యతను కూడా గుడ్డులోని ప్రోటీన్‌తో పోల్చి చూస్తారు. సంపూర్ణ మాంసకృత్తుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో.. తర్వాత పాలు, మాంసాహారం ఉంటాయి.

పప్పుల్లోని ప్రోటీన్ల కంటే గుడ్డులోని ప్రోటీన్లు తేలికగా జీర్ణమవుతాయి. అందువల్ల ఇవి ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు అన్నం, పప్పుతో పాటు పాలు, గుడ్డు కూడా పెట్టాలి. పెద్దవారిలోనూ ప్రోటీన్ కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది.

మన దేశంలో చాలామంది వారానికి ఒక గుడ్డు తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న, 47% ప్రజలు బరువు తక్కువగా ఉన్న మనదేశంలో గుడ్డు వాడకాన్ని పెంచటం, ప్రోత్సహించటం చాలా అవసరం. వారానికి 5-6 గుడ్లు తినొచ్చు.

చాలామంది నాటుకోడి గుడ్లు మరింత బలవర్ధకమైనవనీ, వాటిలో పోషకాలు ఎక్కువుంటాయనీ భావిస్తుంటారుగానీ అది నిజం కాదు. నాటు గుడ్డులో అయినా, ఫారం గుడ్డులో అయినా లోపలుండే పోషకాలు ఒకటే.



