- Telugu News Photo Gallery Cinema photos Sunny Leone blasting reply to those trollers attacking her parenting says you are not present in our to check what we do
Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..
Sunny Leone blasts: సన్నీ లియోన్, డేనియల్ వెబర్‌లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం. కానీ చాలా సార్లు ఇద్దరి సంతానానికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో రకరకాలుగా చక్కర్లు కొడుతుంటాయి.
Updated on: Mar 20, 2022 | 10:41 AM

సన్నీ లియోన్, డేనియల్ వెబర్ ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. వారికి ఒక కుమార్తె నిషా, 2 కుమారులు ఎషర్, నోహ్ ఉన్నారు. ఈ మధ్య షూటింగ్‌లను పక్కన పెట్టిన సన్నీ లియోన్..తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. సన్నీ కుమారులు ఇద్దరూ సరోగసీ ద్వారా జన్మనిచ్చిన సన్నీ.. అదే సమయంలో ఓ అమ్మాయి నిషాను దత్తత తీసుకున్నారు.

ఇటీవల సన్నీ.. ఆమె భర్త ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఫోటోలో ఇద్దరూ కుమార్తె నిషా చేయి పట్టుకోలేదు. కొడుకుల చేయి పట్టుకున్నారు. ఇంతకు ముందు చాలా సార్లు సన్నీ, డెనియర్‌ల పెంపకంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు నటి బహిరంగ సమాధానం ఇచ్చింది

సోషల్ మీడియాలో నేను అలాంటి వ్యాఖ్యలను చదవను.. కానీ డేనియల్ వీటన్నింటిపై శ్రద్ధ చూపుతున్నాడని.. దానితో అతను చాలా నిరాశకు గురయ్యాడని సన్నీ తెలిపింది. తనకు కూడా చాలా బాధగా ఉందని.. చాలా సార్లు చెప్పాను. అయినా మన పిల్లల కోసం మనం ఏం చేస్తున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది.

షూటింగ్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల తాను నటిగా అనామిక సిరీస్ ద్వారా OTT అరంగేట్రం చేస్తున్నట్లుగా తెలిపారు.

ఈ ట్రోలింగ్ చేస్తున్నవారు మా ఇంటికి రండి.. అంటూ ట్వీట్ చేశారు. మా పిల్లలకు ఎవరు వండిపెడుతున్నారు..? వారితో ఎవరు ఆడుకుంటున్నారు..? వారిని ఎవరు స్కూల్‌కి తీసుకెళ్తున్నారో చూడరని సన్నీ కౌంటర్ ఇచ్చారు. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉంటామో ఒక్క ఫోటో నిర్ణయించదన్నారు. డేనియల్ తన పిల్లల గురించి ముఖ్యంగా నిషా గురించి చాలా సున్నితంగా ఉంటారని పేర్కొన్నారు.





























