AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ఆ స్టార్ హీరోను పమ్మీ ఆంటీ అని పిలుస్తాను.. అసలు విషయం బయటపెట్టిన బుట్టబొమ్మ..

టాలీవుడ్ బుట్టబొమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే (Pooja Hegde).. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.

Pooja Hegde: ఆ స్టార్ హీరోను పమ్మీ ఆంటీ అని పిలుస్తాను.. అసలు విషయం బయటపెట్టిన బుట్టబొమ్మ..
Pooja Hegde
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2022 | 11:08 AM

Share

టాలీవుడ్ బుట్టబొమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే (Pooja Hegde).. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత పూజాకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి.. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వరుస ఆఫర్లు అందకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇటీవల రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో డాక్టర్ ప్రేరణగా కనిపించి ఆకట్టుకుంది పూజా హేగ్డే. ఓవైపు ఈ మూవీకి నెగిటివ్ టాక్ వస్తున్న .. మరోవైపు మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ మూవీతోపాటు.. ఆటు బాలీవుడ్‍లోనూ బిజీ అయింది పూజా. ఆమె నటించిన సర్కస్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటింస్తుండగా.. పూజా అతని ప్రేయసిగా కనిపించనుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పూజా హెగ్డే.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. పూజా మాట్లాడుతూ.. రణవీర్ సింగ్ అంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. తనను పమ్మీ ఆంటీ అని పిలుస్తాను.. ఎందుకంటే సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందర్ని అదే పనిగా గమనిస్తుంటాడు.. ఈమూవీలో మా ఆన్ స్క్రీన్ కెమిస్టీ చాలా బాగుంటుంది. మీరు గొప్ప ఆన్ స్క్రీన్ జంటను చూస్తారని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. వరుణ్ శర్మ కీలకపాత్రలలో నటించారు. తాజా సమాచారం ప్రకారం రణవీర్ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట.. ఇందులో సిద్ధార్థ జాదవ్, జానీ లీవర్, సంజయ్ మిశ్రా, మురళీ శర్మ, సుల్భా ఆర్య, వ్రజేష్ హిర్జీ తదితరులు కూడా ఉన్నారు.

Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్ 

భావోద్వేగ కామెంట్స్.. 

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..

RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..

Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..